తెలుగుదేశం నేత అయ్యన్న పాత్రుడిపై ఏపీ పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇటీవల ఏపీ పరిపాలన అస్తవ్యస్తం చేశారు అంటూ జగన్ పై తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విరుచుకుపడిన విషయం తెలిసిందే.
ఉదాహరణలతో సహా జగన్ తప్పులను ఏకి పడేశారు. ఏపీలో రోడ్ల పరిస్థిితి, పోలీసు పాలన, సామాన్యులపై దాడులు, అప్రజాస్వామిక నిర్ణయం, కంపెనీలను తరిమేయడం వంటి అనేక అంశాలంపై అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. అప్పటి నుంచి ఆయనపై రకరకాల కేసులు పెట్టి ఇరకాటంలో పడేసేందుకు జగన్ గవర్నమెంటు ప్రయత్నం చేస్తోంది.
తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై ఏపీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఏపీ హోంమంత్రి సుచరితకు ఇప్పుడు కనీసం ఎస్సై అయినా సెల్యూట్ చేస్తారా? అంటూ అయన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు తప్పు అంటూ గుంటూరులోని అరండల్ పేట పోలీసులూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.
హోం మంత్రిపై చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేముల ప్రసాద్ అనే న్యాయవాది ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసు బుక్ చేశారు.ఇప్పటికే అదే సందర్భంగా జగన్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నకరికల్లు స్టేషన్ లో కేసులు నమోదయిన విషయం తెలిసిందే.