సభ్యుల విశ్వాసం పొందటంలో విఫలమైన ప్రత్యర్థులు, నిన్న మేరీల్యాండ్, వర్జీనియా ప్రాంతంలో బాల్లెట్లు అపహరణకు గురయ్యాయని దుష్ప్రచారం చేస్తూ, నా ప్రమేయాన్ని జత చేసి, మీడియాకు అవాస్తవాలు చేరవేసి, కనీస జ్ఞానం మరిచి, కుసంస్కారంతో ఆరోపణలు గుప్పించి అదే వార్తను తెలుగు పత్రికలలో ప్రచురించి వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు.
సేవా సంస్థల్లో ప్రాతినిధ్యం వహించాలనుకునే ప్రతి ఒక్కరూ కనీస స్పృహతో, బాధ్యతతో ప్రవర్తించాలి. ఏ ఆధారాలతో మీరు నా ప్రమేయం ఉందని పత్రికలకెక్కారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇది పూర్తిగా నిరాధారం. సభ్యులను గందరగోళ పరిచి, అసత్య ప్రచారాలతో మీరు అవలంబిస్తున్న ఈ విధానాన్ని, మీ సంకుచిత ధోరణిని పూర్తిగా ఖండిస్తున్నాను.
ఏం కేసు వేస్తారు – ఏం జరిగింది అని, అసలు సమాజసేవ లో ఉన్న ఎవరన్నా ఇలాంటి దుశ్చర్యలు ప్రోత్సహిస్తారా? ఈ పత్రికా ప్రకటన ఇచ్చిన వారు సిగ్గుతో తలదించుకోవాలి. కేవలం సేవా భావంతో, 25 సంవత్సరాలుగా రాజధాని ప్రాంతం వేదికగా ప్రవాస తెలుగు సంస్థకు అధ్యక్షుడిగా, పలు పదవుల్లో బాధ్యతలు నిర్వహించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ.. ఈనాడు ప్రతిష్టాత్మక ‘తానా’ వేదికగా ప్రజాస్వామ్యయుత ఎన్నికల్లో నిలిచి సభ్యుల మద్దతుతో ముందుకు సాగుతున్న మాకు
ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుండి పూర్తి సానుకూల దృక్పధంతో ముందుకు సాగుతున్న మాపై, ప్రత్యర్థి వర్గం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, ప్రతి విషయంలో అడ్డగోలుగా నిరాధార నిందలు వేస్తూ, కనీసం ఒక సేవా సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న కనీస మర్యాద కూడా మరిచి ప్రవర్తిస్తున్న ప్రత్యర్థులకు, మా దృక్పధాన్ని మరొక్కమారు తెలియజేస్తున్నాం.
సత్యనారాయణ మన్నే