ఏపీ సీఎం జగన్ గురించి.. అనేక పాటలు ఉన్నాయి. ఆయన పాదయాత్ర సమయంలోను.. దీనికి ముందు ఓదార్పు యాత్ర సమయంలోనూ ప్రత్యేకంగా పాటలు రాయించుకుని పాడించుకుని.. ప్రసారం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే.. అవన్నీ జగన్ డబ్బులు ఇచ్చి రాయించుకున్న పాటలే. కానీ, రూపాయి ఖర్చు లేకుండా.. సీఎం జగన్ గురించి రాసిన పాటలు కూడా ఉన్నాయి.
వాటిని రాసిన వారు.. పాడిన వారుకూడా.. సీఎం జగన్ తరచుగా చెప్పే.. అంగన్ వాడీ అక్క చెల్లెమ్మలే కావడం గమనార్హం. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలిపిన విషయం తెలిసిందే. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ.. డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. తమ సమస్యలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిరసన తెలిపారు.
ఈ నిరసనలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు వినూత్నంగా తమ సమస్యలపై నిరసించారు. సాధార ణంగా సమస్యలను ప్లకార్డులు, నినాదల ద్వారా, ధర్నా, రాస్తారోకో, ర్యాలీ ఇలా వివిధ రూపాల్లో తెలియజే స్తారు. కానీ, ఒంగోలు కలెక్టరేట్ ఆవరణలో కొందరు కార్యకర్తలు, ఆయాలు పాటల రూపంలో తమ ఆవేదన వినిపించారు. సినిమా పాటలకు పేరడిగా తమ సమస్యలను గీతాల రూపంలో జగన్పై అల్లి ఆలపించారు. ఈ సమయంలో ఓ ఆయా పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.
ఇంతకీ.. ఆయా పాడిన పాట లిరిక్ ఏంటంటే..
నువ్ మోసగాడివన్నా.. మేము మోసపోయినామన్నా..
నువ్ ఇంటికి పోతావన్నా జగనన్నా.. ఓ జగనన్నా
అందమైనవాడా.. చందమామలాంటి జగనన్నా..
నువ్వు వచ్చినావని మురిసిపోతిమన్నా.. ముంచేస్తివన్నా
ఈ బండ కరిగిన కానీ, ఆ కొండ కరిగిన కానీ..
నీ గుండె కరగదయ్యో.. నీ మనసు మారదయ్యో.. జగనయ్యో
అన్నీ పెంచినావు.. మా జీతం పెంచలేవా?
కరెంటు బిల్లు పెంచావు.. గ్యాసు బిల్లు పెంచి నోరు కొట్టినావు
మా పొట్ట గొట్టినావు.. అంగన్వాడీలనూ ఆగం చేసినావు..
నువ్వు ఇంక రావు అయ్యో.. నువ్వు ఇంటికి పోతావయ్యో
https://youtu.be/OGCneRC2Kd0