జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటించిన బ్రో చిత్రంపై ఏపీలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వైసీపీపై మంత్రి అంబటి రాంబాబును అవమానించేలా శ్యాంబాబు పాత్రను తెరకెక్కించారని రచ్చ జరిగింది. ఈ విషయంపై అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆ చిత్ర నిర్మాత, పవన్, త్రివిక్రమ్ లపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు, ఆ చిత్ర నిర్మాత ఫండ్స్ ను అమెరికా నుంచి ఇండియాకు అక్రమ మార్గంలో తెచ్చారంటూ ఢిల్లీ వెళ్లి మరీ కంప్లయింట్ ఇస్తానని చెప్పారు.
ఆ వ్యవహారం ఇంకా సద్దుమణగక ముందే తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ టాక్ నడుస్తోంది. పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తు దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ఓ ట్వీట్ పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. మెడపైన చేయి వెనక్కు పోనిస్తూ ఉండే పవన్ కల్యాణ్ ట్రేడ్ మార్క్ మేనరిజాన్ని హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. దీంతో, ఆ ట్వీట్ పై పవన్ అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. బ్రో సినిమాలో మంత్రి పై చిన్న సెటైర్ వేస్తేనే అంత రచ్చ జరిగిందని, ఇక ఉస్తాద్ సినిమా చూస్తే వైసీపీ నేతల పరిస్థితి ఏంటని ట్వీట్ చేస్తున్నారు పవన్ అభిమానులు.
బ్రో లో కేవలం శాంపిల్ చూపించారని, ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ తరహా సెటైర్ల సునామీ ఉండబోతోందని పీఎపీకే ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు. అందులోనూ మాస్ పల్స్ బాగా తెలిసిన హరీష్ శంకర్ చాలా గ్యాప్ తర్వాత తీస్తున్న ఈ మూవీ గబ్బర్ సింగ్ 2 అనే టాక్ పీకే ఫ్యాన్స్ ఓంది. ఇక మాస్ పంచులు పేల్చడంలో, చమత్కారపు సంభాషణలు రాయడంలో హరీష్ శంకర్ ది అందెవేసిన చేయి. దీంతో, ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలైన మరుసటి రోజే వైసీపీ నేతల ప్రెస్ మీట్లు హోరెత్తిపోయి…ఆ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని, కాబట్టి, ఆ సినిమా కచ్చితంగా బంపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.