పోలవరం ప్రాజెక్టు వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చకు కారణమైంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మరో ఐదేళ్లు పడుతుందని.. కేవలం స్పిల్ వే నిర్మాణ మే నాలుగేళ్లు పడుతుందని.. సోమవారం ప్రాజెక్టు వద్ద పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అసలు పోలవరం పరిస్థితి ఏంటో కూడా.. అర్ధం కావడం లేదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు అర్థం ఉంది. ఎందుకంటే.. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును లేనిపోని.. మలుపులు తిప్పింది.
ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం ద్వారా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కాకుండా కూడా చేసింది. ఇక, గైడ్ బండ్ వరదల్లో కొట్టుకుపోయినప్పుడు కూడా.. సరైన భద్రతా చర్యలు తీసుకోలేదు. దీంతో పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అడకత్తెరలో పడిపోయింది. దీనిపై తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. జలవనరుల శాఖ మంత్రిగా తాను అనేక సార్లు.. పోలవరంలో పర్యటించానని.. అధ్యయనం చేశానని.. ఎంతో మంది నిపుణులతోనూ మాట్లాడానని అయినా.. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో దాని పరిస్థితి ఏంటో తనకు అర్ధం కాలేదన్నారు.
ప్రస్తుతం చంద్రబాబు చెప్పిన.. “ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు“ అన్న వ్యాఖ్యలను అంబటి కోట్ చేస్తూ.. ఇప్పుడు చంద్రబాబు చెప్పేది ఏముంది.. ఎప్పుడో తాను చెప్పానని అన్నారు. అయితే.. వాస్తవానికి జగన్ హయాంలో ఇద్దరు మంత్రులు జలవనరుల శాఖను చూశారు. మొదట్లో అనిల్ కుమార్ యాదవ్.. తర్వాత అంబటి రాంబాబు జలవనరుల మంత్రులుగా పనిచేశారు. కానీ, ఇద్దరూ కూడా.. ఎప్పుడూ పోలవరాన్ని సీరియస్గా తీసుకున్నది లేదు. ముఖ్యంగా అంబటి రాంబాబు.. ఏదో సినిమాకు వెళ్లి వచ్చినట్టు.. పోలవరానికి వెళ్లిరావడం అది కూడా.. మూడు సార్లు మాత్రమే పర్యటించడం గమనార్హం.
వాస్తవానికి బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరం.. పూర్తికి వైసీపీ సర్కారు మనసు పెట్టి చేసింది లేదు. కనీసం.. ఎప్పు డూ కూడా.. దీనిపై చర్యలు తీసుకున్నది కూడా లేదు. సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా.. ఇంకే ముంది పోలవరం కోసమే ఆయన ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని అంబటి రాంబాబు మాట్లాడారు. కానీ, ఆయన హయాంలో అసలు ప్రాజెక్టును పట్టించుకున్నదే లేదు. పోలవరం కుడి కాల్వ, పోలవరం ఎడమ కాల్వ అంటే ఏంటో `గైడ్ బండ్` దేనికో కూడా ఆయన తెలియని పరిస్థితిలో రెండున్నర సంవత్సరాలు గడిపేశారు. ఏనాడైనా అధ్యయనం చేయడం.. పోలవరం ప్రాజెక్టు మంచి చెడులు పరిశీలన చేయడం, వ్యవసాయ, సాగునీటి రంగాల నిపుణులు, ఇంజనీర్లతో భేటీ కావడం వంటివి చేయనేలేదు. సంబరాలపై ఉన్న పోలవరంపై ఎక్కడా చూపించలేదు. ఫలితంగానే అది ఆయనకు అర్థం కాని ప్రాజెక్టుగా నిలిచిపోయింది.