గిడుగు వెంకట రాంమూర్తి గారి జయంతి సందర్భముగా సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ ,వీధి అరుగు- నార్వే, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ బాషా-సాంస్కృతిక శాఖలు వారు ప్రపంచంలోని 55 కి పైగా తెలుగు సమాఖ్యల సౌజన్యముతో తెలుగు భాష దినోత్సవంను ఈ సంవత్సరం 28 -29 ఆగష్టున అంతర్జాలంలో ఘనంగా నిర్వహిస్తున్నాము.
ముఖ్యముగా ఈ కార్యక్రమం ద్వారా కోవిద్-19 వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు కళాకారులకి కొంత ప్రోత్సాహం అందించాలని నిర్వాహకుల ఆలోచన.
ఈ రోజు మీ అందరి సమక్షంలో మన మొదటి కార్యక్రమ సమాచార పత్రాన్ని ఆవిష్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాం.
ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందీస్తున్న ప్రప్రంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలవారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రం సమర్పకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ప్రపంచం నలుమూలల ఉంటూ తెలుగు భాష ఉనికి కోసం పరితపించే మీరందరు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
ఇట్లు
SATC – సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ & వీధి అరుఁగు