‘తానా’ సభ్యులు ఎక్కడున్నా తమ సేవా తత్పరతను వదిలిపెట్టరు. తాము ఎదుగుతూనే నలుగురి క్షేమం కాంక్షిస్తారు. అలాంటి వారిలో ఒకరు ప్రవాసాంధ్రుడు, ‘తానా’ ఫౌండేషన్ కోశాధికారి ‘శశి కాంత్ వల్లేపల్లి’ మరియు ఆయన కుటుంబం. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ‘శశి కాంత్ వల్లేపల్లి’ తాజాగా హయత్నగర్ పరిధిలోని తుర్కయంజల్ మునిసిపాలిటీలోని మునుగునూరులోని సెంటర్ ఫర్ సోషల్ సర్వీసెస్ ఆశ్రమ పాఠశాలకు ‘తానా’ ఫౌండేషన్ కోశాధికారి ‘శశి కాంత్ వల్లేపల్లి‘, ఆయన సతీమణి, క్యూ హబ్ సీఈఓ ‘ప్రియాంక వల్లేపల్లి’లు నిత్యావసరాలు విరాళంగా అందజేశారు.
గడిచిన వారాంతం 30 మంది విద్యార్థినులకు ₹ 5 లక్షల ఉపకారవేతనాలను అందించడం విశేషం. 50 మంది విద్యార్థినుల కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. అక్కడితో ఆగలేదు వారి మనసు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒక తరగతిని దత్తత తీసుకుని నిర్వహణ ఖర్చు మొత్తం భరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు అందరూ బాగా చదువుకుని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కోరారు.ఈ సందర్భంగా వారు బాలికల కోసం ఈ ఆశ్రమం నిర్వహిస్తున్న వేమూరి విజయలక్ష్మిని అభినందించారు.