సాగర నగరం విశాఖ అంటే మక్కువ చూపని తెలుగు ప్రజలు ఉండరు., విశాఖ గురించి చర్చ మొదలుకాగానే, మన మదిలో ఠక్కున మొదిలే పేరు ‘దసపల్లా’ హోటల్. విశాఖతో విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకున్న ‘దసపల్లా’ హోటల్ ఇప్పుడు ఒక్క విశాఖకు మాత్రమే పరిమితం కాదు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా, తెలంగాణ రాజధానిగా కొనసాగుతున్న హైదరాబాద్ లోనూ ఇప్పుడు ఆతిథ్య సేవలందిస్తోంది. భాగ్యనగరిగా పేరొందిన హైదరాబాద్ లో ఇప్పటికే పెద్ద సంఖ్యలో స్టార్ హోటళ్లున్నా, వాటన్నింటినీ తలదన్నేలా ‘దసపల్లా’ హైదరాబాద్ ఏర్పాటైంది. దీని వెనుక ‘శరత్ జాస్తి’ కృషి ఎంతగానో ఉందని చెప్పాలి. అసలు విశాఖకు మాత్రమే పరిమితమైన ‘దసపల్లా’ను తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ప్రత్యేకించి హైదరాబాద్ కు పరిచయం చేసింది ‘శరత్ జాస్తి’నే. నేడు ‘శరత్ జాస్తి’ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన ప్రస్థానాన్ని ఓ సారి మననం చేసుకుందాం.
కీర్తి శేషులు ‘జాస్తి వాయునందన్ రావు’ కుమారుడైన ‘శరత్ జాస్తి’ వ్యాపార రంగంలో తనదైన స్పీడుతో దూసుకెళుతున్నారు. ‘దసపల్లా’ హోటల్స్ గ్రూప్ చైర్మన్ ‘మండవ రాఘవేంద్ర రావు ‘ అల్లుడిగా మరియు జాస్తి బాలాజీ సోదరుడగా వారి దీవెనలతో వ్యాపర వర్గాలకు పరిచయమైన ‘శరత్ జాస్తి” వ్యాపార రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే ‘శరత్ జాస్తి’ ‘దసపల్లా’ గ్రూప్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే, మరిన్ని ప్రాంతాలకు విస్తరించే పనిని భుజానికెత్తుకున్నారు. అందులో భాగంగా తొలుత విశాఖలోనే ‘దసపల్లా ఎగ్జిక్యూటివ్ కోర్టు’ పేరిట బ్రాంచిని ఏర్పాటు చేసి సక్సెస్ అయిన శరత్ జాస్తి, ఆ తర్వాత మరింత స్పీడు పెంచేశారు. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించాల్సిందేనన్న లక్ష్యంతో సాగిన శరత్ జాస్తి, తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో హోటల్ ‘జయా రెసిడెన్సీ’ పేరిట మరో శాఖను ఏర్పాటు చేశారు.
‘దసపల్లా’ విస్తరణలో తాను చేపట్టిన రెండు శాఖలు విజయవంతం కావడంతో మరింత కాన్ఫిడెన్స్ ను ప్రోది చేసుకున్న శరత్ జాస్తి, తన తదుపరి లక్ష్యంగా భాగ్యనగరి హైదరాబాద్ నే ఎంచుకున్నారు. అప్పటికే విశ్వ నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ లో స్టార్ హోటళ్లకు కొదవే లేదు. అంతేకాకుండా హైదరాబాద్ లో ఎంట్రీ ఇవ్వాలంటే, అప్పటిదాకా ఉన్న స్టార్ హోటళ్లకు ధీటుగా ఉంటేనే రాణించే అవకాశాలెక్కువ. ఈ విషయంపై పక్కా అవగాహనతోనే ఉన్న శరత్ జాస్తి, ‘దసపల్లా హైదరాబాద్’ పేరిట జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్:37లో స్టార్ హోటల్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం కూడా గ్రాండ్ సక్సెస్ కావడంతో ‘శరత్ జాస్తి’ తనలోని వ్యాపార నైపుణ్యాలతో మరిన్ని రంగాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఆతిథ్య రంగంలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ‘శరత్ జాస్తి’ ఫైనాన్స్, కన్ స్ట్రక్షన్, అగ్రి బిజినెస్ లలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ రంగాల్లోనూ ‘శరత్ జాస్తి’ తనదైన శైలి విజయాలను చేరుకోవాలని మనసారా ఆశిద్దాం.