సందీప్ రెడ్డి వంగ… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఒక సంచలనం. దర్శకుడిగా తన తొలి చిత్రం అర్జున్ రెడ్డితో అతను ఎలాంటి ప్రకంపనలు రేపాడు తెలిసిందే. దాని హిందీ రీమేక్ కబీర్ సింగ్ కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక సందీప్ కొత్త చిత్రం యానిమల్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర పెను విధ్వంసం సృష్టించి.. ఎన్నో వివాదాలకు కూడా తెరతీసింది.
ఈ సినిమా రిలీజ్ తర్వాత హీరో రణబీర్ కపూర్ కంటే దర్శకుడు సందీప్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోందన్నది వాస్తవం.
సందీప్ ను ప్రశంసల్లో ముచ్చెత్తుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే తెగనాడుతున్న వాళ్ళు ఉన్నారు. మొత్తంగా అతను అయితే హాట్ టాపిక్ గా మారుతున్నాడు. తాజాగా సందీప్ గురించి యానిమల్ నటుడు సిద్ధాంత్ కర్ణిక్ ఒక ఆసక్తి కర విషయం వెల్లడించాడు.
యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ బావ పాత్రలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సిద్ధాంత్.. ఓ ఇంటర్వ్యూలో సందీప్ గురించి మాట్లాడుతూ దర్శకుడు కావడానికి ముందు అతను పడ్డ ఇబ్బందుల గురించి ప్రస్తావించాడు.
యానిమల్ షూట్లో భాగంగా తాను సందీప్ గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని.. ఈ క్రమంలోనే తన తొలి చిత్రం అర్జున్ రెడ్డి మొదలవడానికి ముందు ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి సందీప్ సోదరుడు ప్రణయ్ చెప్పిన విషయాలను అతను వెల్లడించాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండగా దర్శకుడు కావడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమైన సందీప్.. చివరికి స్నేహితులతో కలిసి తన తొలి చిత్రం నిర్మించడానికి పూనుకున్నాడని.. కానీ కొన్ని రోజుల్లో సినిమా మొదలు కాబోతుండగా అతనికి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు చేతులెత్తేసారని సిద్ధాంత్ తెలిపాడు.
ఈ పరిస్థితుల్లో విధిలేక సందీప్ కుటుంబం తమకు పూర్వీకుల నుంచి వచ్చిన 36 ఎకరాల మామిడి తోటను సందీప్ తొలి చిత్రం కోసం డబ్బు సర్దుబాటు చేసిందని.. ఆ డబ్బుతోనే అతను అర్జున్ రెడ్డి తీశాడని.. ఈ విషయం తెలిసి తనెంతో ఆశ్చర్యపోయానని.. సందీప్ కు తన కుటుంబం ఇంతగా అండగా నిలవడం గొప్ప విషయం అని సిద్ధాంత్ తెలిపాడు.