సందీప్ రెడ్డి యానిమల్.. బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచిన సినిమా. కరోనా తర్వాత డల్లుగా నడుస్తున్న బాలీవుడ్‌కు మంచి ఉత్సాహాన్నిచ్చిన చిత్రమిది. ఇంత పెద్ద సక్సెస్ అయిన సినిమా విషయంలో బాలీవుడ్ ప్రౌడ్‌గా ఫీలవ్వాలి. కానీ సినిమాలో అనేక అంశాల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్వయంగా బాలీవుడ్ ప్రముఖులు, పేరున్న క్రిటిక్స్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మీద విమర్శలు గుప్పిస్తున్నారు.
బాలీవుడ్లో అన్ని సంస్కారవంతమైన సినిమాలు, సిరీస్‌లే వస్తున్నట్లు, సందీప్ మొత్తం హిందీ పరిశ్రమనే బ్రష్టుపట్టించేస్తున్నట్లు ఒక్
ఐతే సందీప్ ఇంత దూకుడుగా ఉండడం అతడికి మంచిదేనే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కబీర్ సింగ్, యానిమల్ అంచనాలను మించి బ్లాక్బస్టర్లు అయ్యాయి. దీంతో సందీప్ కాన్ఫిడెన్స్ పీక్స్‌కు చేరుకుంది. దీంతో తన సినిమాను టార్గెట్ చేసిన వాళ్ల మీద అతను విరుచుకుపడుతున్నాడు. కానీ రోజులు ఎప్పుడూ ఒకలా ఉండవు. అన్ని సినిమాలకూ ఒకే రకమైన ఫలితం రాదు. బాలీవుడ్ ప్రముఖులను, మీడియాను ఇప్పుడు అగ్రెసివ్‌గా ఢీకొంటే.. వాళ్లకు సమయం వచ్చినపుడు దెబ్బ కొట్టడానికి వేచి చూస్తారు.
రేప్పొద్దున సందీప్ సినిమా అటు ఇటు అయితే.. అందరూ కలిసి దాని మీద పడిపోతారు. అతడి సినిమాలను దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో ముందు నుంచే పని చేయడం మొదలుపెడతారు. ఇలా ఇండస్ట్రీ ప్రముఖులు, మీడియా వాళ్లు ఒక లక్ష్యంతో పని చేస్తే ఎల ా ఉంటుందో గతంలో రామ్ గోపాల్ వర్మ విషయంలో రుజువైంది. వరుసగా ఆయన సినిమాలు తేడా కొట్టాక బాలీవుడ్ వదిలి వచ్చేయాల్సి వచ్చింది వర్మ. కాబట్టి సందీప్ కూడా కొంచెం అగ్రెషన్ తగ్గించుకుని ఆచితూచి మాట్లాడితే మంచిదేమో. అన్నింటికీ మించి తన పనేదో తాను చేసుకుపోవడం ఇంకా బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.