ఈ మధ్య కాలంలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా విరూపాక్ష . పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ఈ వేసవికి ఇదే బిగ్గెస్ట్ హిట్. సరైన సక్సెస్‌లో లేని సాయిధరమ్ తేజ్‌ను హీరోగా పెట్టి కొత్త దర్శకుడు కార్తీక్ వర్మ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలనం రేపింది. తొలి వీకెండ్‌కే కొత్త సినిమాలు బకెట్ తన్నేస్తున్న రోజుల్లో కొన్ని వారాల పాటు ఈ చిత్రం నిలకడగా వసూళ్లు రాబట్టింది.
ఈ సినిమాకు కథ అందించింది కార్తీకే అయినా.. స్క్రీన్ ప్లే సమకూర్చింది అతడి గురువు, స్టార్ డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమా క్లైమాక్స్ మొత్తం ఆయన క్రెడిటే అని కార్తీక్ ఇంతకుముందే వెల్లడించాడు. నిజానికి కార్తీక్ మొదట రాసుకున్న కథలో విలన్ హీరోయిన్ సంయుక్త కాదట. హీరో సోదరిగా కనిపించే శ్యామలను అతను విలన్‌గా అనుకున్నాడట. ఐతే సుకుమార్ తనను కన్విన్స్ చేసి విలన్‌గా సంయుక్తను మార్చినట్లు కార్తీక్ వెల్లడించాడు. ‘‘నేను అనుకున్న కథలో పార్వతి (యాంకర్ శ్యామల) అసలు విలన్. అదే విషయాన్ని సుకుమార్ గారికి చెప్పాను.
కానీ అది అంత ఇంపాక్ట్ ఇవ్వదని.. క్లైమాక్స్ బ్లాస్ట్ అవ్వాలని.. అందుకే సంయుక్తను విలన్‌గా మార్చమని ఆయన చెప్పారు. దీంతో క్లైమాక్స్ స్క్రీన్ ప్లే మొత్తం మారిపోయింది. విలన్ మారడంతో అందుకు తగ్గట్లు కొత్త సన్నివేశాలు రాసుకున్నాం’’ అని కార్తీక్ తెలిపాడు. ఫుల్ రన్లో రూ.100 కోట్ల గ్రాస్ మార్కును కూడా అధిగమించిన ‘విరూపాక్ష’ థియేటర్లలో ఇంకా ఓ మోస్తరుగా ఆడుతుండగానే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఈ చిత్రం డిజిటల్ రిలీజ్లోనూ మంచి స్పందనే తెచ్చుకుంటోంది. ఇంతకుముందు తేజుతో ‘సోలో బ్రతుకే సో బెటర్’ లాంటి యావరేజ్ మూవీ తీసి కొంత నష్టం మూటగట్టుకున్న బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రంతో భారీ లాభాలే అందుకున్నారు.