• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చిరు కోసం ఆ డైరెక్టర్ అంత త్యాగం చేశాడా?

లూసిఫర్ రీమేక్ టైటిల్ 'గాడ్ ఫాదర్'...టైటిల్ ఇచ్చేసిన సంపత్ నంది

admin by admin
August 4, 2021
in Movies
0
0
SHARES
179
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ దర్శకుడు కొరటాల శివల కాంబోలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నటిస్తుండడంతో మెగా అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తండ్రీకొడుకులిద్దరూ ఫుల్ లెంగ్త్ పాత్రల్లో నటిస్తున్న తొలి చిత్రం ఆచార్య కావడంతో మెగా అభిమానులు ఈ సినిమా ఎప్పుడెపుడు విడుదలవుతుందా అని చూస్తున్నారు.

అయితే, కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ ల నేపథ్యంలో ఈ చిత్ర విడుదల తేదీ వాయిదాపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగా అభిమానులకు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. 2 పాటలు మినహా ఈ చిత్ర టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్రబృందం ట్వీట్ చేసింది. మేలోనే విడుదల కావాల్సిన ‘ఆచార్య’ షూటింగ్ దశలోనే ఆగిపోయింది. ఇటీవల మళ్ళీ షూటింగ్ మొదలవడంతో టాకీ పార్ట్‌ను త్వరగా కంప్లీట్ చేశారు. త్వరలోనే మిగిలిన రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసి వీలైనంత త్వరగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

త్వరలోనే రిలీజ్ డేట్ కూడా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఆగస్టు 22న చిరు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రూపంలో మెగా ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇక, ఈ చిత్రం పూర్తి కాగానే మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్ ను చిరు మొదలుపెట్టబోతున్నారట. ఈ చిత్ర టైటిల్ ‘గాడ్ ఫాదర్’ అని ఫిక్స్ అయిందని టాక్ వస్తోంది.

అంతేకాదు, చిరు స్వయంగా ఫోన్ చేసి అడగడంతో తాను రిజిస్టర్ చేసుకున్న ‘గాడ్ ఫాదర్’ టైటిల్ ను చిరు కోసం డైరెక్టర్ సంపత్ నంది త్యాగం చేశారని తెలుస్తోంది. ఈ టైటిల్‌ను చిరు బర్త్ డేకి అనౌన్స్ చేస్తార‌నే టాక్ వస్తోంది. మరోవైపు, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన మలయాళ సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘వన్’ను కూడా చిరు రీమేక్ చేస్తే బాగుంటుందని, ప్రత్యక్ష రాజకీయాలను అతి దగ్గరగా చూసిన చిరుకు ఆ కథ సరిగ్గా సరిపోతుందని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Tags: acharya shooting updatedirector sampath nandigodfather titlelucifer remakemegastar chiranjeevi
Previous Post

జగన్ కు హైకోర్టు షాక్…దేవినేని ఉమకు ఊరట

Next Post

మాధవ్ కు ఆర్ఆర్ఆర్ రౌద్ర రూపం…కౌంటర్ అదిరింది

Related Posts

purandheswari
Andhra

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

March 21, 2023
pawan kalyan with nithin
Movies

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

March 21, 2023
pawan kalyan
Movies

పవన్ ఈ స్పీడేంటి సామీ !

March 21, 2023
Top Stories

చిరు, చెర్రీలతో అమిత్ షా ‘నాటు’ భేటీ

March 18, 2023
Movies

వేసవి.. వేడి మొదలవుతుందా?

March 18, 2023
akshay kumar OMG2
Around The World

దెబ్బకు ఓటీటీ బాట పట్టాడా?

March 17, 2023
Load More
Next Post

మాధవ్ కు ఆర్ఆర్ఆర్ రౌద్ర రూపం...కౌంటర్ అదిరింది

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!
  • Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు
  • కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?
  • ‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!
  • విశాఖలో విషాదం
  • కేటీఆర్ బుక్కయ్యాడు… ఆ ట్వీట్ వల్లేనా??
  • ఒక్కటి తేడా వచ్చినా జగన్ కు షాకే!
  • మీ టైం అస్స‌లేం బాలేదు!:  తెలంగాణ పంచాంగంలో కేసీఆర్‌కు షాక్‌
  • ఆ ఇద్దరికీ విడాకులు గ్యారంటీ !
  • పండుగ పూట కేటీఆర్ నుంచి అలాంటి ట్వీట్ వచ్చిందంటే?
  • మొన్న రేవంత్.. నిన్న బండి.. సిట్ సేమ్ సీన్

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra