ఈ వార్తకు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు
కానీ ఈ వార్త సమీరా రెడ్డి గురించి.
శీర్షికలో చెప్పింది కూడా అదే.
గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో విష్ణువర్దన్ రెడ్డి మాట్లాడుతూ సమీరారెడ్డి నా ఫేవరెట్ నటి అని చెప్పారు.
అవును ఇన్నాళ్లు సంసార సాగరంలో పడి కనిపించకుండా పోయిన ఆ సమీరారెడ్డి గురించి తాజాగా ఒక వార్త వచ్చింది.
ఆమె పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతున్న సమీరా రెడ్డి తాజాగా ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టింది
ఫిట్నెస్, మానసిక ఆరోగ్యం నుంచి పేరెంటింగ్ వరకు, అనేక విషయాలపై తాజాగా ఆమె మాట్లాడారు.
ఆ మధ్య బాగా బరువు పెరిగానని, ఇపుడు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నాని చెప్పారు.
“9 కిలోలు తగ్గాను. హార్డ్ వర్క్ ఫలించింది! ఇది # ఫిట్నెస్ఫ్రైడే, నేను ఇప్పుడు 92 కిలోల నుండి 83 కిలోలకు చేరాను. త్వరలో మరో 8 కిలోలు తగ్గుతాను అని” ఆమె ఇన్ స్టాగ్రామ్ లో రాసింది.
వ్యాయామం తప్పనిసరి చేసుకున్నానని, అందులో బాక్సింగ్ ఒక భాగమని, త్వరలోనే దీనిపై ఒక వీడియోను అప్డేట్ చేస్తానని చెప్పారు.
ఇంతకీ ఈ సమీరా రెడ్డి 9 కిలోలు కోల్పోవటానికి ఎంత టైం పట్టిందో తెలుసా… దాదాపు 3 నెలలు.
ఆల్ ద బెస్ట్ సమీరా!