సౌత్ తో పాటు నార్త్ లోనూ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో సమంత ఒకరు. తనదైన గ్లామర్ మరియు టాలెంట్ తో అనతి కాలంలోనే సమంత స్టార్డమ్ అందుకుంది. కోట్లాది మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయిన సమంత.. పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా స్రగ్గుల్స్ ను ఫేస్ చేస్తోంది. ముఖ్యంగా గత ఏడేళ్ల నుంచి ఈ అక్టోబర్ మంత్ సమంతకు బ్యాడ్ సెంటిమెంట్ గా మారింది.
2017 అక్టోబర్ 6న సమంత పెళ్లి పీటలెక్కింది. తన ప్రియసఖుడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో ఏడడుగులు వేసింది. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన సమంతకు నిరాశే ఎదురైంది. పెళ్లై నాలుగేళ్లు తిరక్క ముందే నాగచైతన్య, సమంత విడిపోయారు. ఈ జంట విడాకులు తీసుకుంటే 2022 అక్టోబరు నెలలోనే కావడం గమనార్హం. అక్టోబర్ 2వ తేదీన సోషల్ మీడియా ద్వారా తమ విడాకులను ప్రకటించారు. ఆ టైమ్ లో ప్రతి ఒక్కరూ సమంతనే ఎత్తి చూపారు. దారుణంగా ఈమెను దూషించారు.
2022 అక్టోబర్ నెలలోనే సమంత ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తాను మైయోసైటిస్ వ్యాధి బారిన పడ్డట్లు ప్రకటించింది. మైయోసైటిస్ వల్ల శరీరకంగా మరియు మానసికంగా ఎన్నో సమస్యలను ఆమె ఫేస్ చేశారు. కానీ యశోదా సినిమా ప్రమోషన్స్ కు హాజరు కాకూడదనే ఆమె అనారోగ్యం నాటకం ఆడుతోందని కొందరు సమంతను ట్రోల్ చేశారు. ఇక సమంత, నాగచైతన్య విడిపోయిన అక్టోబర్ 2వ తేదీనాడే.. తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ వివాస్పద వ్యాఖ్యలు చేశారు.
సమంత, నాగచైతన్య విడాకులకి కేటీఆర్ కారణమంటూ సురేఖ వ్యాఖ్యానించడం అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు టాలీవుడ్ లోనూ చర్చనీయాంశంగా మారాయి. సురేఖ వ్యాఖ్యలను ఇప్పటికే అక్కినేని కుటుంబం మరియు సమంత ఖండించారు. మరోవైపు ఇతర ఫిల్మ్ స్టార్స్ కూడా సురేఖ చేసిన నిరాధారమైన మాటలపై మండిపడుతున్నారు. మొత్తానికి పెళ్లైన నాటి నుంచి సమంతకు అక్టోబర్ నెల ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఏదో ఒక ఇష్యూతో ఆమె వార్తల్లో నిలుస్తూనే ఉంది. సమంతకే ఎందుకిలా జరుగుతుందో అర్థంగాక అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.