ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన పని లేదు. `ఏ మాయ చేశావే` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అందం, అభినయం, అంతకు మించిన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. అలాగే తన తొలి సినిమా హీరో అయిన అక్కినేని నాగచైతన్యను ప్రేమించి.. అతడితో ఏడడుగులు నడిచింది.
2017లో గోవా వేదికగా వీరి వివాహం అత్యంత అట్టహాసంగా జరిగింది. కానీ, ఏం లాభం పెళ్లై నాలుగేళ్లు పూర్తి కాకుండానే చై-సామ్ లు అనూహ్యంగా విడాకులు వైపు టర్న్ తీసుకున్నారు. మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ గా గుర్తింపు పొందిన ఈ జంట విడిపోయి ఆరు నెలలు కావొస్తున్నా.. అసలు ఎందుకు విడిపోయారు అన్న ప్రశ్నకు మాత్రం ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం దొరకలేదు. ఇక ప్రస్తుతం సమంత సినిమాలు, ఫిట్ నెస్.. ఈ రెండిటిపైనే ఫోకస్ పెట్టింది.
ఇందులో భాగంగానే వరుస సినిమాలను టేకప్ చేస్తూ కెరీర్ పరంగా దూకుడు చూపిస్తోంది. ఇకపోతే చాలా కాలం తర్వాత ఈ బ్యూటీ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఈ చిట్ చాట్ లో ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఆమె చాలా ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది. అయితే ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. మీ తొలి సంపాదన ఎంత..? అని ప్రశ్నించాడు.
అందుకు సమంత.. `సినిమాల్లోకి రాకముందు హోటల్లో హోస్టెస్‌గా ఎనిమిది గంటలు పని చేశాను. అందుకుగాను వారు నాకు రూ. 500 ఇచ్చారు. అదే నా జీవితంలో తొలి సంపాదన` అని బదులిచ్చింది. అలాగే అమ్మాయిల కోసం ఏదైనా స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వమని మరో నెటిజన్ కోరగా.. `మీపైన మీరు నమ్మకం ఉంచండి. మీ కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయండి` అంటూ సామ్ పేర్కొంది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా, సమంత సినిమాల విషయానికి వస్తే.. ఇప్పుడీమె `శాకుంతలం`, `యశోద` అనే రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది. విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి తమిళంలో సామ్ చేసిన `కాతువాకుల రెండు కాదల్` సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే హిందీలో మరో రెండు ప్రాజెక్టులతో పాటు ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు సైన్ చేసినట్లు టాక్ ఉంది.