ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలె భర్త నాగ చైతన్యతో విడిపోయి తన దారి తాను చూసుకున్న సంగతి తెలిసిందే. చైతూకు దూరమైన తర్వాత కెరీర్‌పైనే ఫోకస్ పెట్టిన సమంత.. మునుపటి కంటే ఎక్కువ జ్యోష్తో దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో సామ్‌ను మరో బంపర్ ఆఫర్ వరించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో మంచి పాపులారిటీ దక్కించుకున్న దర్శకుడు శివ నిర్వాణ గతంలో టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోందట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా.. ఇందులో బాలీవుడ్ భామ కియారా అద్వానీని హీరోయిన్గా తీసుకోవాలని శివ నిర్వాణ భావించారట.
కానీ, బిజీ షెడ్యూల్ కారణంగా కిరాయా సున్నితంగా ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. దీంతో రౌడీ సమంతను లైన్లో పెట్టినట్లు ఓ టాక్ తాజాగా బయటకు వచ్చింది. 2018లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన `మహానటి` సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతలు జంటగా నటించారు. అప్పట్లో వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి.
ఈ నేపథ్యంలోనే మరోసారి విజయ్‌కు జోడీగా సమంతను సంప్రదించగా.. ఆమె వెంటనే ఓకే చెప్పిందని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, విజయ్ దేవరకొండ ఇటీవలె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్` సినిమాను పూర్తి చేశాడు. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.