సమంత ప్రెగ్నెన్సీ: ఈ మధ్య వైరల్ అవుతున్న టాపిక్. చిత్రమేంటంటే… దీనిని సమంతనే మొదట స్టార్ట్ చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి క్రేజున్న ఈ హీరోయిన్ ఊ అంటావా పాటతో మరింత వైరల్ అయ్యింది. పైగా దేశమంతటా ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో ఆమెకు చాలా ఆఫర్లు వస్తున్నాయి.
నాగ చైతన్య డైవర్స్ తర్వాత బాధలో వెనుకపడుతుందని కొందరు అనుకున్నారు. వారి ఆశ అంచనాలను సమంత పటాపంచలు చేసింది.
వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. సామ్ కు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ఆఫర్లు వస్తున్నాయి.
మరోవైపు వెబ్ సిరీస్ లోనూ సమంత సత్తా చాటుతోంది. సమంతకు హాలీవుడ్ లోనూ ఆఫర్లు రావడం గమనార్హం.
నాగ చైతన్య సమంత విడిపోయిన తర్వాత కూడా వారిద్దరూ మళ్లీ కలుసుకోవాలని చాలా మంది అభిమానులు ఆశిస్తున్నారు.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా వైరలవుతున్నాయి. ‘‘తన శరీరంలో వచ్చే మార్పుల కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని….అలాంటి వారందరికీ శుభవార్త చెబుతోంది సామ్. ఆగస్టు 7, 2022 ఉదయం 7 గంటలకు తాను ఒక బిడ్డకు జన్మనిస్తానని‘‘ సమంత ప్రకటించింది.
అయితే ఇవి కొత్త వ్యాఖ్యలు కావు. పాతవే…. గతంలో సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామ్ చేసిన ఈ వ్యాఖ్యలను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.