టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్…ఇలా ఏ ఉడ్ చూసినా ప్రస్తుతం స్టార్ కపుల్స్ విడాకుల ముచ్చట హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, హీరో నాగ చైతన్యల విడాకులు మొదలు ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, దర్శక నిర్మాత ఐశ్వర్యల విడాకుల వరకు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇక, యూత్ కు పెళ్లి వద్దని విడాకులే ముద్దని చాటిచెప్పేలా స్టార్ కపుల్స్ విడాకులే ట్రెండ్ సెట్టర్లుగా మారుతున్నాయని వివాదాస్పద, విలక్షణ దర్శకుడు వర్మ చేసిన కామెంట్లు కాకరేపుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత రూత్ ప్రభు తన విడాకుల గురించి చేసిన ట్వీట్ డిలీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సమంత గతంలో విడాకుల గురించి ఇన్స్టాలో చేసిన పోస్ట్ కనబడడం లేదు. దీంతో, నెటిజన్లు ఈ వ్యవహారంపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు. సమంత, నాగ చైతన్య మళ్లీ కలిసిపోతున్నారా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అదేం లేదని, ఇప్పటికే సమంత తన సోషల్ మీడియా ఖాతా నుంచి చైతూ ఫొటోలను డిలీట్ చేసిందని, విడాకుల పోస్ట్ కూడా పాతదైంది కాబట్టి డిలీట్ చేసి ఉంటుందని మరి కొందరంటున్నారు.
సమంత రూత్ ప్రభు -నాగ చైతన్య తిరిగి కలిసే అవకాశం లేదని చాలామంది నెటిజన్లు అంటున్నారు. అయితే, నాగ చైతన్య మాత్రం విడాకులకు సంబంధించిన పోస్టును డిలీట్ చేయలేదు. మరోవైపు, ధనుష్, ఐశ్యర్యలు కలిసిపోతారంటూ ధనుష్ తండ్రి చెప్పిన నేపథ్యంలో చై-సామ్ లు కూడా కలిసి పోతారేమోనని కొందరు డౌటనుమానపడుతున్నారు.