అందరూ మాట్లాడుకుంటున్నదే అయినా.. అధికారిక ప్రకటన వెలువడిన నేపథ్యంలో సమంత.. నాగచైతన్యల విడాకుల వ్యవహారం గడిచిన మూడు..నాలుగురోజులుగా హాట్ టాపిక్ గా మారింది.
మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఈ విషయం మీద జరుగుతున్న చర్చ.. వస్తున్న వార్తలు అన్ని ఇన్ని కావు. ఒక విధంగా చెప్పాలంటే డిజిటల్ కంటెంట్ లోనూ.. మోస్ట్ పాపులర్ వార్తలుగా.. ట్రెండింగ్ వార్తల్లో సమంత.. నాగ చైతన్య విడాకుల వ్యవహారమే నడుస్తోంది.
ఇదిలా ఉంటే.. విడాకుల వ్యవహారాన్ని బయటపెట్టేసిన తర్వాత నుంచి నాగచైతన్య ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ఉండిపోతే.. సమంత మాత్రం పలు పోస్టులను పెడుతూ.. కొత్త చర్చకు తెర తీస్తున్నారు.
ఇదిలా ఉంటే.. గడిచిన కొద్దికాలంగా నాగచైతన్య హోటల్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. షూటింగ్ హడావుడిలో ఉన్న సమంత.. తన నివాసాన్ని హైదరాబాద్ లోనే ఉంచుతానని స్పష్టం చేయటం తెలిసిందే.
దీనికి తగ్గట్లే.. తాజాగా ఆమె గచ్చిబౌలిలోని ఒక విలాసవంతమై ప్లాట్ కు షిఫ్ట్ అవుతున్నట్లు చెబుతున్నారు. తాను హైదరాబాద్ లోనే ఉంటానని.. ఇదే తన కేరాఫ్ అడ్రస్ అని స్పష్టం చేసిన సమంత.. గచ్చిబౌలికి షిప్టు కానున్నట్లు చెబుతున్నారు. సో.. సామ్ కేరాఫ్ గచ్చిబౌలి అన్న మాట.
Plagued by rumours, #SamanthaAkkineni firmly states that she is not moving to Mumbai. pic.twitter.com/2US07szK3Z
— Filmfare (@filmfare) September 29, 2021