గడిచిన కొన్ని నెలలుగా నాగచైతన్య.. సమంతలు ఇద్దరు విడిపోతున్నారని.. విడాకులు ఖాయమన్న మాట మీడియాలోనూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే.. ఈ వాదనలు ఇలా ఉన్న వేళ.. కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ ఇద్దరి మధ్య సమ్ థింగ్ ఏదో తేడా కొడుతోందన్న మాట వినిపిస్తున్న వేళ.. శనివారం సాయంత్రం వేళలో.. తామిద్దరం విడిపోతున్నామని.. ఎవరి దారిన వారు బతకాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా పేర్కొన్నారు. నిజానికి.. వీరిద్దరూ విడిపోతారన్న విషయం మీద చర్చ జరిగినా.. అది కాస్తా నిజమన్న మాట బయటకు వచ్చిన తర్వాత చాలామంది షాక్ తిన్న పరిస్థితి.
ఇండస్ట్రీలో క్యూట్ కఫుల్ గా పేరున్న ఈ ఇద్దరు విడిపోవటం.. ఆ ఇద్దరి సంగతి ఎలా ఉన్నా.. కోట్లాది మంది తెలుగు వారికి మాత్రం అస్సలు నచ్చటం లేదు. విడాకుల విషయం పాతదే అయినా.. కొత్తగా ఫీల్ కావటమే కాదు.. ఈ జంట మధ్య బంధం తెగిపోవటానికి తగిన కారణం ఏమిటన్న విషయాన్ని ఎవరికి వారు వెతుకుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఒక పేరును తెర మీదకు తీసుకొచ్చి చావు తిట్లు తిట్టటమే కాదు.. భయంకరంగా దుమ్మెత్తి పోస్తున్నారు. చై – సామ్ బంధం తెగిపోవటానికి ఇతగాడే కారణమంటూ వీరి ఎపిసోడ్ లో విలన్ అంటూ విరుచుకుపడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది.
వాస్తవానికి ఈ జంట మధ్య విభేదాలు విడాకుల వరకు వెళ్లటానికి కారణం ఫ్యామిలీ మేన్ 2లో సమంత బోల్డ్ సీన్లలో నటించటమన్న వాదన ఒకటి బలంగా వినిపిస్తుంటే.. మరోవైపు సమంత పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ కారణమని మండిపడుతున్నారు.
గతంలో అతడి తొడల మీద సమంత కాళ్లు వేసి ఉండటం.. ఇద్దరూ నైట్ డ్రెస్సులో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో దుమ్ముదుమారం రేపటంతో పాటు.. సమంతను పలువురు తిట్టి పోశారు.
ఇలా ఒకరి కాళ్ల మీద ఒకరు వేసుకొని దిగటం సమంత అభిమానులకు అంతగా నచ్చలేదు. ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తోడు విడాకుల విషయం ఈ జంట ప్రకటించిన వెంటనే.. ప్రీతమ్ చేసిన పోస్టులు కూడా పలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.
అయితే.. ప్రీతమ్ సమంతను అక్క అని పిలుస్తాడని చెబుతున్నా.. అలా అయితే మాత్రం.. కాళ్లు వేసి అంత సన్నిహితంగా ఉంటారా? అంటూ మండిపడుతున్నారు.తాజాగా అభిమానుల నుంచి వస్తున్న తిట్ల వర్షానికి ప్రీతమ్ తన సోషల్ మీడియాలోనికామెంట్ బాక్సును మూసేశాడు.
వాస్తవం సంగతి ఎలా ఉన్నా.. ఇప్పటికైతే చై-సామ్ ఎపిసోడ్ లో రియల్ విలన్ గా మాత్రం ప్రీతమ్ ను చాలామంది చూస్తున్నారని చెప్పక తప్పదు.