హెల్త్ ఇష్యూస్ కారణంగా గత కొద్ది నెలల నుంచి కెమెరాకు దూరంగా ఉన్న సౌత్ స్టార్ బ్యూటీ సమంత.. ప్రస్తుతం కెరీర్ పరంగా మళ్లీ యాక్టివ్ అయింది. సినిమాల ఎంపికలో జోరు చూపిస్తోంది. త్వరలోనే బాలీవుడ్ వెబ్ సిరీస్ `సిటాడెల్: హనీ బన్నీ` తో సామ్ ప్రేక్షకులను పలకరించబోతోంది. వరుణ్ ధావన్ మరియు సమంత జంటగా నటించిన ఈ సిరీస్ 2024 నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది.
ప్రమోషన్స్ కూడా ప్రారంభం అయ్యాయి. అయితే తాజాగా జరిగిన సిటాడెల్ ప్రమోషనల్ ఈవెంట్ లో సమంత తన సన్నిహితురాలు క్రేషా బజాజ్ రూపొందించిన పాస్టెల్ గ్రీన్ కో-ఆర్డ్ సెట్‌తో మిస్మరైజ్ చేసింది. డ్రెస్ కు తగ్గట్లుగా గోల్డ్ ఇయర్ రింగ్స్ మరియు స్టైలిష్ వాచ్ తో సామ్ తన లుక్ ను పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో.. అందరి చూపులు ఆమె వాచ్ పైనే పడ్డాయి.
చూడటానికి చాలా ఎట్రాక్టివ్ గా కనిపిస్తున్న సమంత వాచ్ ధరెంతో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆరాటపడగా.. వారికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఎందుకంటే.. సమంత తన చేతికి ధరించిన వాచ్ స్టైలిష్ మాత్రమే కాదు చాలా కాస్ట్లీ కూడా. బల్గారీ(Bvlgari) సర్పెంటీ వాచ్ ను సమంత స్టైల్ చేసింది. మార్కెట్ లో ఆ బ్రాండెడ్ వాచ్ ధర అక్షరాల రూ.45.5 లక్షలు. ఈ విషయం తెలిసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. సమంత వాచ్ ధరతో ఒక సామాన్యుడు లగ్జరీ ఇల్లు కొనేయొచ్చని అభిప్రాయపడుతున్నారు.
View this post on Instagram