టాలీవుడ్ మన్మధుడు కమ్ కింగ్ నాగార్జున పుట్టిన రోజున. సోషల్ మీడియా పాపులర్ అవుతున్న కొద్దీ.. ప్రముఖులు.. సెలబ్రిటీల బర్త్ డే లను ఘనంగా జరపటం ఆనవాయితీగా మారింది. మామూలుగా అయితే.. విషెస్ చెప్పాలంటే.. అయితే ఫోన్ లోనో.. వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు. లేదంటే కాల్ చేసి చెప్పొచ్చు. కానీ.. సోషల్ మీడియా పుణ్యమా అని.. తాము చెప్పే మెసేజ్ సదరు సెలబ్రిటీతో పాటు.. చుట్టూ ఉన్న ప్రపంచానికి చెప్పటం ఈ మధ్యన ఎక్కువైంది.
నాగ్ పుట్టినరోజు సందర్భంగా పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు.. ప్రముఖులు..సామాన్యులు అందరూ పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు.
అందరి ట్వీట్లు ఒక ఎత్తు అయితే.. ఆయన ముద్దుల కోడలు కమ్ నటి సమంత ట్వీట్ తో విషెస్ చెప్పేశారు. హ్యాపీ బర్త్ డే మామ అంటూ ఆమె చెప్పిన ట్వీట్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం.. ఈ మధ్యన సమంతకు ఆయన భర్త కమ్ నటుడు నాగచైతన్యకు మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ చోటు చేసుకుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
దీనికి తోడు ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లోని ‘అక్కినేని’ పేరును తొలగించటం ‘ఎస్’ చేర్చటం హాట్ టాపిక్ గా మారింది. చానళ్లలో.. వార్తా ప్రతికల్లో ఇదో వార్తాంశంగా మారిపోవటం గమనార్హం.
బయట ఇంత రచ్చ జరుగుతున్నా.. తమ మధ్యన విభేదాలు ఉన్నట్లుగా సాగుతున్న ప్రచారానికి చెక్ చెప్పేలా.. అందరి డౌట్లు క్లారిఫై అయ్యేలా ఘాటుగా రియాక్టు అయి ఉంటే చప్పుడు చేసి ఉండేవారు కాదు. కానీ.. అందుకు భిన్నంగా మౌనంగా ఉండటం.. ఇరువురు పెదవి విప్పకపోవటం పలు సందేహాలకు తావిచ్చేలా మారింది.
తాజాగా మామ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆమె పెట్టిన ట్వీట్ ఇప్పుడు అందరి చూపు పడేలా చేసింది. ‘‘మీ మీద నాకున్న గౌరవం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు.ఎప్పుడూ అందంగా.. ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే మామ’’ అంటూ ట్వీట్ చేశారు.
నిజంగానే ఏదో ఉండి ఉంటే ట్వీట్ చేసేది కదా? అన్న ప్రశ్నలతో పాటు.. తాజాగా రియాక్టు అయ్యిందంటే ఏమీ లేదన్నట్లే అంటూ చెబుతున్నారు. నిజంగానే ఒక వేళ ఎలాంటి విభేదాలు లేవనే అనుకుందాం.
మామ పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వెళ్లి ఆయనకు సర్ ప్రైజ్ చేయటంతో పాటు.. భర్త నాగ చైతన్యతో కలిసి వెళ్లి ఉంటే.. మరింత క్లియరర్ గా క్లారిఫై అయి ఉండేదన్న మాట వినిపిస్తోంది. సామ్ మరేం చేస్తారో చూడాలి.