టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య, సమంతలు విడాకుల పుకార్లకు తెర పడిన సంగతి తెలిసిందే. తామిద్దరం విడిపోతున్నామంటూ ఇద్దరూఒకే సారి అధికారికంగా ప్రకటించడంతో అప్పటిదాకా వస్తున్న పుకార్లకు ది ఎండ్ పడింది. అయితే, వీరిద్దరూ తమ విడాకుల గురించి ప్రకటన చేయక ముందు నుంచే ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి.
దాదాపుగా 2 నెలల పాటు వీరి విడాకుల విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలోనే కొన్ని యూట్యూబ్ చానెళ్లు, వెబ్ సైట్లు రకరకాల గాసిప్స్ ను ప్రసారం చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా అటువంటి మూడు యూట్యూబ్ చానెళ్లకు సమంత షాకిచ్చింది. సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా ప్రవర్తించిన మూడు యూట్యూబ్ ఛానల్స్ పై కూకట్ పల్లి కోర్టులో సమంత పరువు నష్టం దావా వేసింది సమంత.
సుమన్ టివి, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ తో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్‌పై సమంత తరఫు న్యాయవాది పిల్ దాఖలు చేశారు. సమంత తరపున హైకోర్టు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించనున్నారు. కాగా, సమంత తన విడాకుల గురించి ప్రకటన చేయక ముందు కొన్ని యూట్యూబ్ చానెళ్లు, వెబ్ సైట్లు రకరకాల కథనాలు వండి వార్చాయి. సమంత -నాగచైతన్యల విడాకులకు అమె కాస్ట్యూమ్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కరే కారణమంటూ ప్రచారం చేశాయి.
అయితే, సమంతను ప్రీతమ్ అక్క అని పిలుస్తాడని చాలామంది సెలబ్రిటీలకు తెలుసు. దీంతో, సమంత హర్ట్ అయి…తన పరువుకు భంగం కలిగించిన కొన్ని యూట్యూబ్ చానెళ్లపై కేసు పెట్టాలని డిసైడ్ అయిందట. ఆ యూట్యూబ్ చానెల్స్ వాస్తవదూరమైన కథనాలు ప్రచారం చేసి తన పరువుకు భంగం కలిగించాయని సమంత తన పిటిషన్ లో పేర్కొందట.