సౌత్ స్టార్ బ్యూటీ సమంత గురించి ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విషయం ఏంటంటే.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో సమంత పెళ్లి పీటలెక్కబోతోందట. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా జరగనుందని టాక్ నడుస్తోంది. 2017 లో అక్కినేని నాగ చైతన్యను సమంత ప్రేమ వివాహం చేసుకుంది. కానీ నాలుగేళ్లకే వీరి బంధం విడాకులతో ముగిసింది. ఇటీవల నాగచైతన్య శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. రెండేళ్ల నుంచి సీక్రెట్ రిలేషన్ లో ఉన్న ఈ జంట మరి కొద్ది నెలల్లో మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు.
ఇక ఇదే తరుణంలో సమంత పెళ్లి వార్తలు కూడా ఊపందుకున్నాయి. రాజ్ & డీకే దర్శక ద్వయంలోని ఒకరైన రాజ్ నిడుమోరుతో సమంత ప్రేమలో పడిందట. ది ఫ్యామిలీ మ్యాన్, హనీ బన్నీ వెబ్ సిరీస్ల కోసం సమంత రాజ్ & డీకేలతో కలిసి వర్క్ చేసింది. ఈ క్రమంలోనే రాజ్ తో సమంతకు ఏర్పడిన స్నేహం ప్రేమగా మారిందట. చాలా రోజుల నుంచి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని జాతీయ పోర్టల్లో కథనాలు వెలువడ్డాయి.
రాజ్ కు ఇది వరకే శ్యామాలి అనే అమ్మాయితో వివాహం జరిగింది. అయితే ఇప్పుడు సమంతతో ప్రేమలో పడటంతో రాజ్.. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయ్యాడట. అంతేకాదు త్వరలోనే సమంత, రాజ్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబుతున్నారని వార్తలు వస్తున్నాయి. అధికారిక సమచారం లేనందున ఈ వార్తలు ఎంతవరకు నిజం అన్నది క్లారిటీ లేదు. కాగా, రాజ్ & డీకే దర్శకత్వంలో సమంత యాక్ట్ చేసిన హనీ బన్నీ సీరిస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది.