సౌత్ స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతినిత్యం అనేక విషయాలను సమంత సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ప్రేమకు అసలైన అర్థం ఏమిటో వివరిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అయితే ఆ పోస్ట్ ను సమంత తన మాజీ భర్త నాగచైతన్యను ఉద్దేశించే పెట్టిందని పలువురు చర్చించుకుంటున్నారు.
అసలు సమంత పోస్ట్ లో ఏముందంటే.. `చాలా మంది వ్యక్తులు ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్షిప్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనుకుంటారు. నువ్వు ఇస్తేనే నేను ఇస్తా అనేలా పరిస్థితి ఉంది. కొన్నిసార్లు మనం ప్రేమను పంచినా ఇతరులు తిరిగివ్వరు. ఈ విషయాన్ని నేనూ అంగీకరిస్తాను. కానీ నిజమైన ప్రేమకు అర్థం కొన్నిసార్లు అవతలి వ్యక్తి మనకు ప్రేమనివ్వలేని స్థితిలో ఉన్నా.. మనం ప్రేమనందించాలని నేను నేర్చుకున్నాను.
అలాగే ప్రేమంటే త్యాగం కూడా. అయితే ఇప్పుడది పూర్తిగా మారిపోయింది. ఇక నేను తిరిగి ప్రేమనందించలేకపోయినా.. నన్ను నిరంతరం ప్రేమించే అభిమానులకు రుణపడి ఉంటాను` అని ఆమె రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. చైతును ఉద్ధేశించే సామ్ ఈ ఎమోషనల్ పోస్ట్ పెట్టిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
కాగా, 2021లో నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సామ్ సింగిల్ లైఫ్ లీడ్ చేస్తోంది. మరోవైపు నాగచైతన్య విడాకులైన కొద్ది రోజులకే శోభిత ధూళిపాళ్లతో మళ్లీ ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు ఆమెతో ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవలె శోభిత-చైతు నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.