టాలీవుడ్ మరో ప్రముఖ జంట విడాకుల బాట పట్టినట్టే తెలుస్తోంది.
నాగార్జున సుపుత్రుడు నాగ చైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే.
మొదట్లో బాగానే ఉన్నా ఏ గొడవలు లేకపోయినా సమంతకు ఆ ఫ్యామిలీతో పెద్ద సింక్ అవకపోవడంతో వ్యవహారం విడాకులు దాకా వెళ్లినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే నాగార్జున రెండో కొడుకు అఖిల్ వివాహం ఎంగేజ్ మెంట్ దశలోనే చెడింది.
ఇపుడు చైతు వివాహం ఓ దశకు వచ్చాక పెటాకులు అయ్యింది.
అయితే, ఈ వివాదం చాలా కాలం క్రితమే మొదలైనట్లు అనుకోవాలి.
సమంత చాలా తెలివిగా ఇంతవరకు పిల్లలను ప్లాన్ చేసుకోకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
తాజా అప్ డేట్ ప్రకారం విడాకులు ఇక తీసుకోవాలనే దాకా సమంత వైపు నిర్ణయం అయిపోయిందంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… సమంత కు ఇంతకుముందు ప్రేమ వ్యవహారం ఉంది. అప్పట్లో సిద్ధార్థపై ఆమె చాలా ఆరోపణలే చేసింది. చివరకు చైతూ వంటి కూల్ పర్సన్ తో కూడా పడటం లేదంటే తేడా ఎక్కడుందా అని అందరూ ఆలోచిస్తున్నారు.
ఇప్పటికే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరికీ తొలి విడత కౌన్సిలింగ్ సైతం పూర్తయినట్లు సమాచారం. చాలా రోజుల నుంచి సమంత- చైతన్య ఇద్దరూ విడిగానే ఉంటున్నారు. ఏమైందో ఏమో సమంత ముంబైకి షిఫ్ట్ అయిపోయారు. పూర్తిగా ముంబాయిలోనూ ఉంటూ బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టాలని సమంత నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.