అనుకుంటాం కానీ.. ఇద్దరుప్రముఖుల వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకునే పరిణామాలు..వారికి ఏ మాత్రం సంబంధం లేని వారి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనటానికి తాజా ఉదంతం ఒక నిదర్శనంగా చెబుతున్నారు.
టాలీవుడ్ క్యూట్ కఫుల్ గా పేరున్న నాగచైతన్య.. సమంతలు ఇష్టపూర్వకంగా ఒకరికొరు విడిపోవాలని నిర్ణయించుకోవటం తెలిసిందే. ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించటానికి దాదాపు ఆర్నెల్ల ముందు నుంచే వారి విడాకుల వ్యవహారం మీద మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
నిజానికి విడాకులు అన్నవి ఈ ఇద్దరు సెలబ్రిటీల వ్యక్తిగత విషయమే అయినప్పటికీ.. దాని కారణంగా టాలీవుడ్ డైరెక్టర్ ఒకరి మీద తీవ్ర ప్రభావం చూపించి.. కొత్త కష్టాల్ని తెచ్చి పెట్టిందని చెబుతున్నారు. ఇంతకీ చై.. సామ్ కారణంగా అన్ని కష్టాలు పడింది మరెవరో కాదు.. ఓ బేబీ దర్శకురాలు నందినీ రెడ్డి. లేడీ ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ ను ఇవ్వటమే కాదు.. మార్కెట్లో సామ్ కున్న ఇమేజ్ ఎంతన్న విషయాన్ని స్పష్టం చేసింది.
అయితే..ఈ సినిమా షూటింగ్ సమయంలో చై.. సామ్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలని నందినీ రెడ్డి ప్లాన్ చేశారట. కథ కూడా ఒక కొలిక్కి రావటం.. వారిద్దరూ ఓకే చెప్పటం కూడా జరిగిపోయట. అన్ని ఓకే అనుకొని సినిమా సెట్స్ మీదకు వచ్చేసరికి.. విడాకుల వ్యవహారం తెర మీదకు రావటం.. ఇద్దరు ఎడముఖం.. పెడ ముఖంగా మారిపోవటంతో నందినీ రెడ్డి మూవీ సరిగ్గా సెట్స్ మీదకు వచ్చే సమాయానికి ఆగిపోయిందట.
ఆ సమయంలో వారిద్దరిని డిస్ట్రబ్ చేయటం ఎందుకని ఆగటం.. ఆ తర్వాత వారిద్దరు ఒక్కసారి కూడా మాట్లాడుకోని నేపథ్యంలో.. సదరు సినిమా కంచికేనని చెబుతున్నారు.అయితే.. ఈ ఉదంతం గురించి తెలిసిన వారు నందినీ రెడ్డి చాలా లక్కీ ఫెలో అంటున్నారు. ఒకవేళ సినిమా మొదలై.. మధ్యలో ఈ విడాకుల ఎపిసోడ్ వచ్చేసరికి.. మూవీ ఏ సగమో పూర్తి అయి ఉంటే.. నిండా మునిగిపోయేవారంటున్నారు.
వారిద్దరిని ఒప్పించలేక.. సినిమా పూర్తి చేయలేక దారుణమైన ఇబ్బందులకుగురయ్యే వారు. దాంతో పోలిస్తే.. తాజాగా ఎదురైన ఇబ్బంది చాలా చిన్నదనే చెబుతున్నారు. ఏమైనా.. సెలబ్రిటీల జీవితాల్లో చోటు చేసుకునే వ్యక్తిగత అంశాలు కూడా.. దర్శక నిర్మాతల్ని ప్రభావితం చేస్తాయని చెప్పక తప్పదు. ఇప్పుడు చెప్పండి నందినీ రెడ్డి అదృష్టవంతురాలా? దురదృష్టవంతులా?