సామ్-చైతూ విడాకులు తీసుకోబోతున్నారా? ఇలాంటి ప్రశ్నలు చాలా పాతవైపోయాయి. ఇప్పుడు వీరి ఎపిసోడ్ కు సంబంధించి కొత్త కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. మొన్నటివరకు ఇద్దరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ జరుగుతోందన్న వార్తలు రాగా.. అవి నిజమని.. ఎవరికి వారు బతుకుతున్నారని.. సమంత హైదరాబాద్ లో ఉండటం లేదని.. ఆ మాటకు వస్తే చైతూ.. సామ్ లు విడిగా ఉండటం మొదలు పెట్టి కొంతకాలమైనట్లుగా చెబుతున్నారు. ఈ వార్తలు ఇలా సాగుతున్న వేళ.. సోషల్ మీడియాలోనూ.. వెబ్ సైట్లలోనూ విడాకుల మీద వార్తలు వచ్చినా.. వాటి గురించి ఎవరూ స్పందించింది లేదు.
బయట కనిపించిన సమంతను అడిగే ప్రయత్నం చేస్తే.. కోపగించుకోవటం చూశాం. ఇక.. లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన చైతూను అడిగే ప్రయత్నానికి మొదట్లోనే చెక్ పెట్టేసి.. ఈ ప్రోగ్రాంకు రండి.. కవర్ చేయండి.. కాకుంటే.. వారి పర్సనల్ విషయాల్ని మాత్రం అస్సలు టచ్ చేయొద్దంటూ రిక్వెస్టు కమ్ ఆర్డర్ తో మీడియాను ఆహ్వానించిన వేళ.. వారు చెప్పిన మాటలతో పాటు కొన్ని యాజమాన్యాల నుంచి కొందరు రిపోర్టర్లకు అందిన ఆదేశాల మేరకు.. ప్రోగ్రాంకు వెళ్లి విషయాల్ని కవర్ చేశారే కానీ.. ఎవరూ ఎలాంటి ప్రశ్నలు వేయలేదన్న మాట మీడియా వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
తాజాగా.. సామ్-చైతూ విడాకుల ఎపిసోడ్ ఫైనల్ స్టేజ్ కు వెళ్లిందని.. ఇరు వర్గాల మధ్య భరణం తాలుకూ అంశం మీద చర్చ జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదనలు.. ఇండస్ట్రీకి చెందిన కొందరు చెబుతున్న మాటల్ని చూస్తుంటే.. సామ్ – చైతూలు విడాకులు తీసుకోవటం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సమంత చాలానే లీడ్స్ ఇచ్చారని చెప్పాలి. ఆ మాటకు వస్తే.. విడాకుల ఎపిసోడ్ లో చైతూ లిప్ లాక్ చేసుకొని కూర్చుంటే.. సమంత మాత్రం.. సమ్ థింగ్ జరుగుతోంది బాబు.. మీరు పట్టించుకోరా? అన్నట్లుగా తన సోషల్ ఖాతాల్లో చేసిన మార్పులు.. చేస్తున్న పోస్టులు ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారేలా చేశాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. విడాకుల వేళ.. చైతూ.. సమంతకు ఇవ్వాల్సిన భరణం మీద జోరుగా చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం దాదాపు రూ.100 కోట్ల మేర భరణాన్ని సమంత కోరుతున్నట్లు చెబుతుండగా.. అదంతా సరికాదని.. రూ.300 కోట్ల మేర భరణాన్ని చెల్లించాలన్న డిమాండ్ తో సామ్ వర్గం ఉందన్న మాట వినిపిస్తోంది. చైతూకు ఉన్న స్థిర.. చర ఆస్తుల్లో వాటా ఇవ్వాలని కోరుతున్న వైనంపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారని.. సామ్ చేస్తున్న రూ.300 కోట్ల డిమాండ్ భారీ అని చెబుతున్నారు. అయితే.. ఇందులో నిజానిజాల మాటేమిటి? అన్నది తేలాల్సి ఉంది.
ఇదే సమయంలో.. చైతూ తనను ఎంత కేరింగ్ గా చూస్తాడన్న విషయాలతో పాటు.. తాను భయంకరమైన తప్పులు చేసినా.. చైతూ పట్టించుకోలేదని.. తాను ఎంత సాధారణ స్థితిలో ఉండేదానినన్న విషయంతో పాటు.. తన ఇంట్లో వారికి ఫోన్ చేసేందుకు రీఛార్జి డబ్బులు లేని పరిస్థితిని కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పటాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు రూ.100- రూ.300 కోట్ల మధ్య భరణాన్ని ఎలా అడుగుతారన్నది ప్రశ్నగా మారింది. అయితే.. ఇప్పుడు బయట నడుస్తున్న చర్చల్లో నిజం ఎంతన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా.. సామ్ – చైతూ మధ్య ఏదో నడుస్తుందన్న చర్చ రానున్న రోజుల్లో మరింత జరగటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.