టాలీవుడ్ సెలబ్రటీ కపుల్స్ లో ఒకరైన సమంత రూత్ ప్రభు–నాగచైతన్యల విడాకుల వ్యవహారం చాలాకాలం హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే.వారిద్దరూ విడిపోయిన తర్వాత కూడా ఫలానా కారణంతోనే విడిపోయారంటూ సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో రకరకాల కథనాలు వచ్చాయి. అయితే, సమంత-నాగ చైతన్యల విడాకులపై చాలాకాలం సైలెంట్ గా ఉన్న నాగార్జున…ఇటీవల ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. సమంతే మొదట విడాకులు కోరిందని అన్నారు.
అంతేకాదు, ఆ ప్రయత్నాలనూ సమంత మొదలుపెట్టిందని, చైతూ కేవలం సమంత నిర్ణయాన్ని గౌరవించి విడాకులకు ఓకే చెప్పాడని నాగార్జున చెప్పుకొచ్చారు.సామ్–చైతూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, వారి నాలుగేళ్ల వివాహబంధంలో విడిపోయేంతటి పెద్ద సమస్యేంటో తనకూ ఇప్పటికీ తెలియదని నాగ్ అన్నారు. ఈ కామెంట్స్ చేసిన చానాళ్ల తర్వాత సమంత చైతూ ఇంటికి రావడం ఇపుడు చర్చనీయాంశమైంది.
పెళ్లైన తర్వాత చైతూతో సమంత ఓ ఇంట్లో కాపురం పెట్టింది. అది ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ ది. అయితే, ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఓ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కొని ఈ ఇంటిని వేరే వాళ్ళకు అమ్మేశారు. ఆ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే ఆ కొత్త ఇంటి రీ మోడలింగ్ అయ్యే వరకు పాత ఇంట్లోనే రెంట్ కి ఉంటామని చై, సామ్ లు చెప్పడంతో ఆ ఇల్లు కొన్నవారు కూడా ఓకే అన్నారు.
ఆ తర్వాత సమంత, చైతూలు విడిపోవడం…సొంత ఇంటి కోసం సమంత బయట చాలా వెతకడం జరిగినా ఫలితం లేదు. దీంతో, తాము అమ్మి, తాను ఉంటోన్న పాత ఇంటినే మళ్లీ కొనేందుకు సిద్ధపడి మురళీమోహన్ ను సామ్ సంప్రదించిందట. తానుంటున్న ఇల్లు కొన్నవారికే ఎక్కువ రేటు ఇచ్చి మరీ తన పాత ఇంటిని సమంత మళ్లీ కొనుక్కుందట. ప్రస్తుతం సమంత అక్కడే తన తల్లితో కలిసి ఉంటోంది. ఈ విషయాలన్నీ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మురళీ మోహన్ చెప్పారు. దీంతో, చైతూతో ఉన్న మెమొరీస్ ను మరచిపోలేకే సమంత పాత ఇంటిని మళ్లీ కొనుక్కుందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు.