సౌత్ స్టార్ బ్యూటీ సమంత తాజాగా ఒక గుడ్ న్యూస్ ను పంచుకుని తన ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కెరీర్ పరంగా మరింత జోరు చూపించాలని సమంత భావించినప్పటికీ.. మయోసైటిల్ వ్యాధి ఆమె ఫ్లాన్స్ ను నాశనం చేసింది. సమంతను ఇంటికి పరిమితం అయ్యేలా చేసింది. హెల్త్ ఇష్యూస్ కారణంగా సమంత చాలా ప్రాజెక్ట్ లను చేజార్చుకుంది. కొన్నిటిని అతి కష్టమీద పూర్తి చేసింది. ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాక సమంత రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయింది.
సుమారు ఏడాదిన్నర కాలం నుంచి కెమెరాకు దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడు మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టింది. ఒక హిందీ వెబ్‌సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా ద్వారా సమంత స్వయంగా పంచుకుంది. తన పేరుతో ఉన్న స్క్రిప్ట్ బుక్ ఫొటోను ఇన్‌స్టా ద్వారా షేర్ చేసిన సామ్.. కనలు కనడం ఎప్పుడూ ఆపోద్దు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత సెట్స్‌లో అడుగుపెట్టడం హ్యాపీగా ఉందని కూడా పేర్కొంది.
కాగా, ప్రస్తుతం `రక్త బ్రహ్మాండ్` అనే సిరీస్ షూటింగ్ లో సమంత పాల్గొంటోంది. హారర్ కథాంశంతో తెరకెక్కుతున్న రక్త బ్రహ్మాండ్ సిరీస్ కు తుంబాద్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకద్వయం రాజ్ డీకే క్రియేటర్స్‌గా, ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తోన్నారు. ఇందులో అలీ ఫజల్, ఆదిత్యరాయ్ కపూర్, సమంత ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ముంబైలో ఈ సిరీస్ చిత్రీకరణ జరుగుతోంది. మొత్తానికి సమంత షూటింగ్స్ స్టార్ట్ చేయడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.