కాంట్రవర్షియల్ టాక్ షో గా పేరున్న ‘కాఫీ విత్ కరణ్’ ఏడో సీజన్ లో సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు పాల్గొన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి సామ్ ఈ షోలో సందడి చేసింది. ఆల్రెడీ సామ్, కరణ్ ల మధ్య ఫన్నీ కాన్వర్జేషన్ తో విడుదలైన ఈ షో ప్రొమో వైరల్ అయింది. ఇక, సామ్, అక్కీల ఎపిసోడ్ గురువారం స్ట్రీమ్ కాబోతున్న నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన మరో ప్రొమో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.
ఈ ప్రొమోలో అక్షయ్ కుమార్ తో కలిసి సమంత రచ్చ రచ్చ చేయడంతో ఆ ప్రొమో వైరల్ అయింది. తనకు పాన్ ఇండియా రేంజ్ లో మరింత గుర్తింపు తెచ్చిన ఊ అంటావా మామ పాటకు అక్కీతో కలిసి సామ్ వేసిన స్టెప్పులు హీట్ పుట్టించాయి. ఈ ఇద్దరు కలిసి చేసిన మాస్ డాన్సుకు నెటిజన్లు, సామ్ అభిమానులను ఫిదా అయ్యారు. ఇంకా చెప్పాలంటే బన్నీతో కలిసి ఒరిజినల్ ట్రాక్ లో వేసిన స్టెప్పులు, ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లతో పోలిస్తే అక్షయ్ కుమార్ తో సమంత వేసిన స్టెప్పులు, ఎక్స్ ప్రెషన్లు మరింత కిక్కిచ్చేలా ఉన్నాయి. ఆ ప్రోమోలో సమంతని అక్షయ్ ఎత్తుకుని తీసుకురావడం, గిరగిరా గాల్లో తిప్పడం, ఇద్దరు కలిసి జిగ్ జాగ్ డాన్సు చేయడం వంటి ఫన్నీ గ్లింప్స్ ఉండడంతో కుర్రకారు ఆ ఎపిసోడ్ ఎప్పుడెపుడు చూద్దామా అని ఆతృతగా ఉన్నారు.
బన్నీతో చేసిన దానికి మించి సమంత రెచ్చిపోయి అక్షయ్‌తో కలిసి ఊరమాస్ స్టెప్పులేయడంతో ఆ వీడియో ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. సమంత, అక్షయ్ కుమార్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని, వీరిద్దరి నాటు స్టెప్పులు అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆన్ స్క్రీన్ లో సామ్-అక్కీ జంట అదరగొట్టిందని, ఈ ఇద్దరి కాంబినేషన్లో మంచి రొమాంటిక్ సినిమా ఒకటి తీయాలని వారి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
కాగా, కొద్ది రోజుల క్రితం విడుదలైన ప్రొమోలో కరణ్ తో వైవాహిక జీవితం గురించి సమంత క్లాస్ పీకడం కనిపిస్తోంది. సామ్ ను కరణ్ ఇరుకున పెట్టాలని ప్రయత్నించినట్లు ఆ ప్రొమోలో కనిపిస్తోంది. అయితే, అన్ హ్యాపీ మ్యారేజెస్ కి కరణ్ జొహరే కారణమని సమంత నిందించింది. కరణ్ తన సినిమాల్లో వైవాహిక జీవితాన్ని కభీ ఖుషీ కభీ గమ్ లో లాగా చాలా అందంగా ఉంటుందని చూపిస్తాడని, కానీ, వాస్తవానికి వైవాహిక జీవితం కేజీఎఫ్ లా ఉంటుందని సెటైర్ వేసింది సామ్.