అందరూ రూల్స్ ను ఫాలో అవుతుంటారు. కానీ.. కొందరు వాటిని బ్రేక్ చేస్తుంటారు. ఇదంతా చట్టం.. న్యాయం లాంటి సీరియస్ అంశాలకు సంబంధించి కాదు. వ్యక్తిగత.. కెరీర్ కు సంబంధించినవి. సాధారణంగా టాలీవుడ్ లో ఏ అగ్రశ్రేణి హీరోయిన్ అయినా.. పెళ్లి చేసుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో విజయాల్ని సొంతం చేసుకోవటం చూశారా? పీక్స్ లో ఉండే కెరీర్.. పెళ్లి మాట బయటకు వచ్చినంతనే ఒక్కసారిగా పుల్ స్టాప్ పడిపోయే పరిస్థితి.
అలాంటి ఇండస్ట్రీలో.. పెళ్లి జీవితంలో ఒక అధ్యాయమే తప్పించి అదే జీవితం మొత్తం కాదన్న విషయాన్ని నమ్మటమే కాదు.. ప్రజలంతా కూడా నమ్మేలా చేసి.. వారిని తన వెంట నడిపించుకోవటం. తన మీద ప్రదర్శించే ఆదరాభిమానాలకు ఏ మాత్రం లోటు రాకుండా చూసుకోవటం మామూలు విషయం కాదు.
సామ్ అలియాస్ సమంత ఇందుకో పెద్ద ఉదాహరణగా చెప్పాలి. అక్కినేని వారింటి కోడలిగా ట్యాగ్ ఆమెకు తగిలించినా.. దాని దారి దానిదే.. తన దారి తనదే అన్నట్లుగా వ్యవహరించటం ఆమెకే చెల్లుతుంది. తాను ఉన్న గ్లామర్ ఇండస్ట్రీలో ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న రూల్స్ ను బద్ధలు కొట్టేసిన ఘనత సామ్ దే.
పెళ్లి తర్వాత సినిమాలు చేయటం.. పలు వాణిజ్య బ్రాండ్లకు యాడ్స్ చేయటమే కాదు.. బోల్డ్ గా నిర్ణయాలు తీసుకోవటం.. సోషల్ మీడియాలో పెళ్లికి ముందు ఎలానో.. పెళ్లి తర్వాత కూడా అలానే ఘాటు ఫోజులతో ఫోటోల్ని పోస్టు చేయటం లాంటివి చూస్తే.. మిగిలిన నటీమణులకు సామ్ భిన్నమన్న భావన కలుగక మానదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. సోషల్ యాక్టివిటీస్.. చారిటీల కోసం సమయాన్ని వెచ్చిస్తూనే.. వ్యాపారరంగంలోనూ దూసుకెళ్లిపోతున్నారు. ఇన్ని పనులు చేస్తూనే తనకు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవటం ఆమెకే చెల్లుతుంది. ఇంత టాలెంటెడ్ కాబట్టే.. సమంతకు ఇన్ స్టాలో 18 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మరి.. ఆమె పెట్టే పోస్టుకు వచ్చే ఆదాయం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.
ఆ మధ్యన విడుదలైన నివేదిక ప్రకారం ఇన్ స్టాలో బాలీవుడ్ కమ్ హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పెట్టు పోస్టు ఒక్కొక్కదానికి రూ.3కోట్లు ఇస్తారన్న వార్త బయటకు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రియాంక అంత కాకున్నా.. సమంత పెట్టే ప్రతి పోస్టుకు రూ.25 లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఛార్జ్ చేస్తారన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. రెండు చేతలతో సంపాదన అన్న పాత మాటకు.. వీలైనన్ని విధాలుగా సంపాదించటం సామ్ కు తెలిసినంత బాగా తెలుగు ఇండస్ట్రీలో మరెవరికీ తెలీదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.