సమంత ఈ మధ్య బాగా వార్తల్లో నానుతోంది. చైతన్యతో విడాకుల వ్యవహారమే దీనికి కారణం. ఆమె ఎక్కడికి వెళ్లినా ఈ ప్రశ్న వెంటాడుతోంది. సమంత గాని, నాగ చైతన్య గాని ఈ వ్యవహారం గురించి నోరు విప్పడం లేదు. వారిద్దరు కలిసి ఉండటం లేదు. ఈ నేపథ్యంలో విడాకులు గ్యారంటీ అని అందరికీ అర్థమైపోయింది.
ఇలాంటి శాడ్ న్యూస్ వైరల్ అవుతున్న నేపథ్యంలో సమంత ఫోన్ చేసి ఏడ్చింది అనే వార్త వైరల్ కావడంతో అంతా కుటుంబ వ్యవహారమే అనుకున్నారు. కానీ నిజానికి అది దూకుడు సినిమా టైంలో జరిగిన ఒక సంఘటన కు సంబంధించిన వార్త.
దూకుడు సినిమాలో మహేష్ బాబు, సమంత నటించారు. శ్రీను వైట్ల దర్శకుడు. ఆ సమయంలో ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ కావడంతో సమంత షాపింగ్ వెళ్లిందట. సమంత ఎదురుగా ఒక ఆత్మాహుతి దాడి జరిగిందట. తన కళ్ల ఎదుటే జరిగిన ఆ ఘోరం సమంతను షాక్ గురిచేసిందట. చాలాసేపు ఆమె దాన్నుంచి బయటకు రాలేదట. తర్వాత తేరుకుని దర్శకుడు శ్రీనువైట్లకు ఫోన్ చేసిన సమంత ఆ దుర్ఘటన గురించి చెబుతూ బోరున ఏడ్చేసిందట.
శ్రీను వైట్ల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. ఇపుడు అది వైరల్ అవుతోంది. దూకుడు సినిమా ఇస్తాంబుల్ లో కొంత పార్ట్ తీసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో శ్రీను వైట్లకు కూడా ఒక అనుభవం ఎదురైందట. అతను స్టే చేసిన హోటల్ గాలికి ఊగే చెట్టులా కదలాడిందట. ఏంటిది అని ఆరా తీస్తే భూకంపం అట. భూకంపాలు ఎక్కువగా వచ్చే దేశాల్లో టర్కీ ఒకటి.