నంద్యాల ముస్లిం కుటుంబం ఆత్మహత్య ఎంతవైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో చీకటి కోణం ఏంటంటే… తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వీడియో ట్వీట్ చేసేంత వరకు పోలీసులు కేసే నమోదు చేయలేదు. అప్పటి వరకు కేవలం రైల్వే పోలీస్ స్టేషన్లో మాత్రమే కేసు నమోదైంది.
ఎపుడైతే చంద్రబాబు నాయుడు ఆ ముస్లిం కుటుంబం ఆత్మహత్య వీడియోను వెలుగులోకి తెచ్చారో వెంటనే వారి మృతికి కారణం అయిన పోలీసులపై కేసు పెట్టారు. అది కూడా ఏదో పెట్టీ కేసు పెట్టారు. అయితే, ఆ పోలీసులు బెయిలు మీద రిలీజయ్యారు. ఈ గొడవలో ఎలాగైనా టీడీపీని ఇరికించే ప్రయత్నంలో తెలివిగా టీడీపీ సానుభూతి పరుడైన ఒక లాయర్ ను కలిశారు. పెట్టింది చిన్నకేసులు అయినపుడు బెయిలు సహజంగానే వస్తుంది.
టక్కున ముఖ్యమంత్రి తెరపైకి వచ్చి టీడీపీ లాయరు వారికి బెయిలు ఇప్పించాడన్నారు. సరే ఆ లాయరు టీడీపీ సానుభూతి పరుడు అయ్యిండొచ్చు. టీడీపీ పార్టీ అయితే… జనం తాము చేసే పనులన్నీ చంద్రబాబుకు చెప్పి చేయరు కదా. దీనిపై నమస్తే ఆంధ్ర నిన్న ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు జగన్ గారూ… నలుగురి మరణానికి కారణం అయిన పోలీసుపై అసలు బెయిలబుల్ కేసు పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటని నమస్తే ఆంధ్ర అనుమానం వ్యక్తంచేసింది.
ఈరోజు ఆ పాయింట్ ను చంద్రబాబు సంధించారు. ఆయన ఏమన్నారంటే…
కోర్టు చివాట్లు పెట్టినప్పుడైనా డీజీపీ మారి ఉంటే సలాం కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అసలు రాష్ట్రంలో ఏ కుటుంబానికి భద్రత లేదని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సలాం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులయిన వారి ఉద్యోగాలు పీకేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ ఎందుకు జరిపించకూడదు అని ప్రశ్నించారు.
సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని చంద్రబాబు ఆరోపించారు.కేసు పెట్టినట్టు ఉండాలి.. బెయిల్ రావాలనే రీతిలో పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. తెదేపా న్యాయవాది ద్వారానే బెయిల్ వచ్చిందంటూ కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు.అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, రాజధాని రైతులపై ఎలాంటి కేసులు పెట్టారు? పనికిమాలిన రాజకీయాలు చేస్తూ ఎవరిని మోసం చేస్తున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఎందుకు మీరు అంత వీక్ కేసు పెట్టారు?
బెయిలు రావాలనే కదా అని చంద్రబాబు నిలదీయడంతో వైసీపీ నాయకుల్లో సౌండ్ లేదు.