సలార్ సినిమా వాయిదా వార్తల తాలూకు ప్రకంపనలు రెండు రోజులు దాటినా ఆగట్లేదు. ఇటు ప్రభాస్ అభిమానులు.. అటు ఇండస్ట్రీ జనాలు ఈ వార్త తెలిసిన దగ్గర్నుంచి షేక్ అయిపోతున్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు మూడు డిజాస్టర్లు ఎదురు కావడంతో తీవ్రంగా నిరాశ చెందిన ఫ్యాన్స్.. ‘సలార్’ మీద బోలెడన్ని ఆశలతో రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓవర్సీస్లో వేలమంది ఈ సినిమా టికెట్లు కొని ప్రిమియర్స్‌కు రెడీ అయ్యారు.
వీళ్లందరి ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. ఇక ‘సలార్’ కోసమని రెండు మూడు వారాలు విడిచిపెట్టి రిలీజ్ డేట్లు ప్లాన్ చేసుకున్న వాళ్లందరూ ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. ‘సలార్’ కొత్త డేట్ ఏదైన ఉంటుందనే విషయంలో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ తమ మీద వచ్చి ‘సలార్’ బాంబు పడుతుందో అని తర్వాతి నెలల్లో తమ చిత్రాలను షెడ్యూల్ చేసుకున్న మేకర్స్ ఆందోళన చెందుతున్నారు.
ఒక్క సినిమా వాయిదాతో ఇంతమందికి ఇబ్బందికర పరిస్థితి రావడం అరుదు. ఇంత పెద్ద సినిమా తీస్తూ రిలీజ్ విషయంలో సరిగ్గా ప్లాన్ చేసుకోలేరా అని ఇటు ఫ్యాన్స్, అటు ఇండస్ట్రీ జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐతే రెండు రోజులుగా సోషల్ మీడియా అంతటా ‘సలార్’ వాయిదా తాలూకు చర్చలు, గందరగోళమే నడుస్తుండగా.. ‘సలార్’ టీం మాత్రం మౌనం వహిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సినిమా వాయిదా అనే విషయాన్ని కేవలం తమ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం చెప్పి ఊరుకోవడం కరెక్టా అన్నది ప్రశ్న. ఈ ప్లానింగ్ లోపానికి ‘సలార్’ టీం కచ్చితంగా అందరికీ సారీ చెప్పి వారి కోపాన్ని తగ్గించాల్సి ఉంది.
ఇంత జరుగుతున్నా కనీసం సినిమాను వాయిదా వేస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడమేంటో అర్థం కాని విషయం. ఒకవేళ కొత్త రిలీజ్ డేట్ విషయంలో తర్జనభర్జనలు నడుస్తుండొచ్చు. కానీ అది వెంటనే తేలే విషయం కాదు. ముందు వాయిదా విషయం చెప్పి.. త్వరలో కొత్త డేట్ ఇస్తామని అయినా ప్రకటించి ఉండాల్సింది. లేదు కొత్త డేట్ ఇద్దామనుకుంటే త్వరగా ఈ విషయాన్ని వెల్లడించాలి. అలా కాకుండా అందరినీ అసహనంలో, అయోమయంలో పెట్టి ‘సలార్’ టీం మౌనం వహించడం మాత్రం కరెక్ట్ కాదు.