కొన్నింటి గురించి తెలిసినంతనే ఇలా కూడా చేస్తారా? అన్న షాక్ తగులుతుంది. ఇప్పుడు చెప్పేది అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. పైలెట్ గా ట్రైనింగ్ ఇచ్చేటోడు.. తాను ట్రైనింగ్ ఇస్తున్న ట్రైనీ పైలెట్ మీద మనసు పడటమే కాదు..డర్టీ ప్రపోజల్ పెట్టిన వైనం.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామం ఇప్పుడు అవాక్కు అయ్యేలా చేసింది. ఇంతకూ జరిగిందేమంటే..
ట్రైనీ పైలెట్లకు శిక్షణ ఇచ్చే సీనియర్ పైలెట్ ఒకరు. 28 ఏళ్ల అతను 21 ఏళ్ల ఒక ట్రైనీ పైలెట్ కు శిక్షణ ఇస్తుంటాడు. ఒక రోజు విమానంలో వెళుతున్న వేళ.. ఆమె మీద తాను మనసు పడిన విషయాన్ని చెప్పి.. తన కోరిక తీర్చాలని కోరాడు. అందుకు ఆమె.. నో చెప్పింది. అప్పటికే పెళ్లైన అతనితో తాను రొమాన్సు చేయలేనని స్పష్టం చేసింది. దీంతో.. అతనో డర్టీ ఆఫర్ ఇచ్చాడు. ‘నాతో సెక్స్ చేస్తే నీకు ఎక్కువ గంటలు ట్రైనింగ్ ఇస్తాను’ అని ఆశ చూపటంతో.. ఆమె అందుకు ఓకే చెప్పింది. అంతే.. ఆ వెంటనే వారి రొమాన్సులో మునిగిపోయారు.
గాల్లో ఉన్న విమానాన్ని ఆటో పైలెట్ మోడ్ లో పెట్టిన సదరు పైలెట్ ఆమెతో రొమాన్సును మరింత భిన్నంగా చేయాలని భావించాడు. అందులో భాగంగా.. తమ భాగోతాన్ని తమ సెల్ ఫోన్లో బంధించే ఏర్పాటు చేసి ఎంజాయ్ చేశారు. తాము చేసిన ఈ ప్రమాదకరమైన పనిని బయటకు చెప్పలేదు. గప్ చిప్ గా పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన వారు.. ఎవరి పనిలో వారు బిజీ అయ్యారు. తాను చేసిన పనిని సదరు ట్రైనీ.. తన స్నేహితురాలికి చెప్పటం.. వీడియోను షేర్ చేసింది.
తర్వాత కొద్ది కాలానికి సదరుస్నేహితురాలితో ఆమెకు గొడవైంది. ఆ కోపంలో ఈ పాడు వీడియోను ఆమె లీక్ చేసింది. దీంతో.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఫ్లయింగ్ స్కూల్.. వారిద్దరిని స్కూల్ ను టెర్మినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మొదట్లో ట్రైనీ పైలెట్ తాను కేవలం ముద్దులు.. హగ్గులు మాత్రమే చేసుకున్నామని.. అంతకు మించిముందుకు వెళ్లలేదని పేర్కొన్నారు.
వీడియో పూర్తిగా వచ్చిన తర్వాత వారు చేసిన భాగోతం మొత్తం ప్రజల ముందుకు రావటంతో తప్పు ఒప్పుకొని.. ఆ తర్వాత మళ్లీ తానెప్పుడూ అలా చేయలేదని చెప్పింది. రష్యాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం వైరల్ గా మారింది.