చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించే పరిస్థితి రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటుంది. అందునా ఎన్నికల సందర్భంగా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తుంటాయి పార్టీలు. అలాంటిది కేంద్రంలోని మోడీ సర్కారుకు ఏమైందో కానీ.. ఊహించని రీతిలో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి.
సామాన్య.. మధ్యతరగతి ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేసే చిన్న మొత్తాల పొదుపుపై కేంద్రం వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు బుధవారం వెలువడ్డాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న కీలక వేళలో.. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో విపక్షాల చేతికి అస్త్రంగా మారింది.
కోట్లాది మంది సామాన్యుల మీద ప్రభావం చూపించే ఈ నిర్ణయం తొందరపాటుతో వెలువడిందన్న విషయాన్ని గుర్తించిన బీజేపీ.. మిగిలిన పార్టీలు రియాక్ట్ అయ్యే లోపే బీజేపీ నష్ట నివారణను మొదలు పెట్టింది.
కేంద్రం నిర్ణయాన్ని మీడియాలో ప్రముఖుంగా అచ్చేసి.. ఆ విషయాల్ని ప్రజలు అర్థం చేసుకోవటానికి ముందే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేసి.. తగ్గించిన వడ్డీరేట్లను యథావిథిగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించటమే కానీ వాటిని వెనక్కి తీసుకోవటం.. ప్రజా వ్యతిరేకత.. పార్టీల విమర్శల్ని పట్టించుకోవటం మొదట్నించి ఉండని విషయం తెలిసిందే.
అలాంటిది మిగిలిన వారు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్పందించే లోపే..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేసి.. పొరపాటున వడ్డీ రేట్లు తగ్గించే ఉత్తర్వుల్నిజారీ చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ పొరపాటును వెంటనే పట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కస్సుమంది. వడ్డీరేట్లను తగ్గించే ఉత్తర్వులను జారీ చేయటంతో నిర్మలా సీతారామన్ నిజంగానే పారపడి.. ఆ తర్వాత దిద్దుబాటు చర్యగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారా? అని ప్రశ్నించారు.
తాజా నిర్ణయం వెనుక ఏదైనా దూరద్రష్టి ఉందా? అని కాంగ్రెస్ ప్రధాన కారర్యదర్శి ప్రియాంకా వాద్రా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ మరింత ఘాటుగా రియాక్టు అయ్యారు. మేడం ఆర్థికమంత్రి.. మీరు సర్కస్ నడుపుతున్నారా? లేక సర్కారా?
కోట్లాది మందిపై ప్రభావాన్ని చూపించే ఆదేశాల్లో పారపాటు ఎలా జరుగుతుంది? దీనికి బాధ్యత ఎవరిది? అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. చూస్తుంటే కాంగ్రెస్ రియాక్షన్ పుణ్యమా అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలమ్మకు మోడీ చేతిలో క్లాస్ తప్పదన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.