వివేకా మర్డర్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీబీఐ విచారణలో నిందితుడు దస్తగిరితో పాటు పలువురు ఇచ్చిన వాంగ్మూలాలు కేసును అనూహ్య మలుపులు తిప్పుతున్నాయి. ఈ క్రమంలోనే పులివెందులకు చెందిన కల్లూరి గంగాధర్‌రెడ్డి గత ఏడాది ఇచ్చిన వాంగ్మూలం ఇపుడు వెలుగులోకి వచ్చి సంచలనం రేపుతోంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలకు అత్యంత సన్నిహితుడైన గంగాధర్‌రెడ్డి ఉండేవారు
అవినాశ్ రెడ్డి కుటుంబంతో వివేకాకు శత్రుత్వం ఉందని, అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలను వివేకా అనుచరులు పట్టించుకునేవారు కాదని, అందుకే వారంతా కలిసి వివేకాను హత్య చేయాలని భావించారని సీబీఐకి సంచలన వాంగ్మూలం ఇచ్చారు. 2019 ఆగస్టులో శివశంకర్ రెడ్డి తనతో మాట్లాడారని, వివేకా మర్డర్ కేసును తనమీద వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చారని గుర్తు చేశారు.
మరో ఇద్దరుముగ్గురితో కలిసి వివేకా హత్య నేరాన్ని తనపై వేసుకుంటే రూ. 10 కోట్లతో పాటు తన భార్యకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఆఫర్ ఇచ్చారని వెల్లడించారు. సిట్ అధికారుల ఎదుట నేరాన్ని అంగీకరించాలని కోరారని అన్నారు. అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డితో కలిసి ప్లాన్ చేసి కొత్త వాళ్లతో వివేకాను చంపించామని, నిందితులు పట్టుబడి వారిని పోలీసులు విచారణ జరిపితే అంతా ఇబ్బందుల్లో పడతామని శంకర్ రెడ్డి తనతో చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. జగన్ సొంత బాబాయ్ విషయం కావడంతో ఇబ్బందుల్లో పడతానన్న ఉద్దేశంతో శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టు గంగాధర్‌రెడ్డి తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు.