ఏపీలో సీపీఎస్ విధానం రద్దు హామీని వెంటనే నిలబెట్టుకోవాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణారాజు సీఎం జగన్ను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛనును రూ.2,750కు పెంచాలని సీఎం జగన్కు ఎంపీ రఘురామ నిన్న లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా సీపీఎస్ హామీని నిలబెట్టుకోవాలంటూ మరో లేఖ రాశారు.
సీఎం జగన్ తన పాదయాత్రలో సీపీఎస్ విధానం రద్దుచేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. పాత విధానాన్ని కొనసాగిస్తానన్నారని జగన్ తెలిపినట్లు లేఖలో ప్రస్తావించారు. సీపీఎస్ విధానం రద్దు హామీతో ఎన్నికల సమయంలో ఉద్యోగుల నుంచి మద్దతు లభించిందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 7 రోజుల్లోనే జగన్ హామీ నెరవేరుస్తానన్నారని.. ఇప్పటికి 765 రోజులు దాటినా ఆ హామీ నెరవేరలేదన్నారు. సీఎం జగన్ సీపీఎస్ విధానం రద్దు హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఎంపీ రఘురామ కోరారు.