ఇటీవల వచ్చిన తెలుగు సినిమాలలో ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు, ఆస్కార్ అవార్డుల నామినేషన్ రేసులో ఉండబోయే చిత్రాలను అంచనా వేసే వెరైటీ మ్యాగజైన్ కూడా చరణ్, తారక్, రాజమౌళిలు నామినేట్ అయ్యే అవకాశముందని అంచనా వేసింది. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మన దేశం తరఫున ‘ఆర్ఆర్ఆర్’ నామినేట్ కాకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
ఆర్ఆర్ఆర్, ది కశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాలను వెనక్కు నెట్టి మరీ గుజరాతీ ఆర్ట్ ఫిల్మ్ ‘ఛెల్లో షో’ ఆ చాన్స్ కొట్టేయడంపై సినీ, రాజకీయ దుమారం రేగింది. గుజరాతీ సినిమా కాబట్టే అది నామినేట్ అయిందని, దాని వెనుక ప్రధాని మోదీ, కేంద్రం పెద్దల హస్తం ఉందని విమర్శలు వచ్చాయి. ఇటువంటి విషయాలపై తెలంగాణ బీజేపీ జోకర్ ఒక్కరు కూడా ప్రశ్నించలేరని మంత్రి కేటీఆర్ కూడా సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
ఆస్కార్ అవార్డులకు సంబంధించిన 15 కేటగిరీలకు నామినేషన్స్ పంపేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాను నేరుగా ఆస్కార్ కు పంపించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలను ప్రారంభించిందని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ ను నామినేట్ చేయబోతున్న 15 కేటగిరీలు ఇవే:
బెస్ట్ మోషన్ పిక్చర్
బెస్ట్ డైరెక్టర్ – రాజమౌళి
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే
బెస్ట్ యాక్టర్ : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : అజయ్ దేవగణ్
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: అలియా భట్
బెస్ట్ సినిమాటోగ్రఫీ : కేకే సెంథిల్ కుమార్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : సాబు సిరిల్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : ఎంఎం కీరవాణి
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ : రమా రాజమౌళి
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్ : నల్ల శ్రీను, సేనాపతి నాయుడు
బెస్ట్ సౌండ్ : (రఘునాథ్ కామిశెట్టి, బోలోయ్ కుమార్ డోలోయి, రాహుల్ కార్పే)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : వి. శ్రీనివాస్ మోహన్