రాష్ట్రంలో ఏ క్షణం ప్రభుత్వ వ్యవస్థలు దుర్వినియోగం అయినా, లేదా అధికార పార్టీకి అనుకూలంగా తమ పరిధి మించి ఎవరైనా మాట్లాడినా వారిని ప్రజాక్షేత్రంలో పెట్టి కడిగి పారేయడం RRR కి అలవాటు. సామాన్య జనాలను ఆలోచింపజేసేలా మాట్లాడటంలో త్రిబులార్ ది అందెవేసిన చేయి.
తాజాగా ఆలయాలపై దాడులను రాజకీయ కుట్రగా అభివర్ణించిన డీజీపీపై నిన్నటి నుంచి విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా రాజుగారు కూడా డీజీపీని ప్రజల ముందు పెట్టి లాజిక్ తో ఇన్వెస్టిగేట్ చేశారు.
దీంతో డీజీపీ వైసీపీకి అనుకూలం అనే విషయాన్ని వంద శాతం ఎస్టాబ్లిష్ చేయడంలో రఘురామరాజు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే త్రిబులార్ ఏదైనా చెబితే అది చట్ట పరిధిలో ఉంటేనే చెబుతారు అన్న నమ్మకం జనాల్లో ఉంది. తాజా వీడియో దానిని ప్రూవ్ చేసింది.