ఇండియాలో సినిమాల శత దినోత్సవాల గురించి మాట్లాడుకుని పుష్కరం దాటిపోయింది. కనీసం అర్ధశత దినోత్సవాలు కూడా కరవైపోయాయి. ఎంత పెద్ద సినిమాలైనా ఒకట్రెండు వారాల్లో వీలైనంత వసూళ్లు రాబట్టుకోవాల్సిందే. మూడో వారం తర్వాత నిలబడే సినిమాలు బాగా తగ్గిపోయాయి.
పట్టుబట్టి, డబ్బులిచ్చి ఒకట్రెండు థియేటర్లలో 50, 100 రోజులు ఆడించడం తప్పితే జెన్యూన్‌గా అన్ని రోజులు ఆడుతున్న సినిమాలు దాదాపు లేవనే చెప్పాలి. ఐతే ఇప్పుడు ఓ ఇండియన్ సినిమా మరో దేశంలో 100 రోజులు ఆడడం.. అది కూడా వంద సెంటర్లకు పైగా కావడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఆ చిత్రం.. ఆర్ఆర్ఆర్ కాగా, అది వంద రోజులు పూర్తి చేసుకున్నది జపాన్‌లో కావడం విశేషం.
ఈ చిత్రాన్ని గత ఏడాది అక్టోబరులో జపాన్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఈ చిత్రాన్ని ఆ దేశంలో బాగా ప్రమోట్ చేశారు. పబ్లిసిటీ కూడా గట్టిగా చేశారు.
జపాన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ మంచి టాక్ కూడా తెచ్చుకుంది. రాజమౌళి ‘బాహుబలి’ అప్పటికే అక్కడ పెద్ద హిట్టవడం దీనికి కలిసొచ్చింది. తొలి రోజు నుంచి భారీ వసూళ్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం ఏకంగా 400 మిలియన్ యాన్ల మైలురాయిని దాటేసింది.
28 ఏళ్లుగా జపాన్‌లో హైయెస్ట్ గ్రాసర్ ఇండియన్ మూవీగా ‘ముత్తు’ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టేసింది. జపాన్‌లో మనలాగా కొత్త సినిమాలు రెండు మూడు వారాలు ఆడేసి వెళ్లిపోవు. ఇంకా అక్కడ మంచి టాక్ తెచ్చుకున్న చిత్రాలకు 50, 100 రోజుల లాంగ్ రన్ ఉంటోంది. ‘ఆర్ఆర్ఆర్’ కూడా అలాగే అక్కడ బాగా ఆడుతూ వచ్చింది.
42 కేంద్రాల్లో డైరెక్ట్‌గా, 114 కేంద్రాల్లో షిప్ట్‌తో శత దినోత్సవం జరుపుకుంటోందట ‘ఆర్ఆర్ఆర్’. ఈ మేరకు ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ అఫీషియల్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే.. ఓ సినిమా ఇన్ని కేంద్రాల్లో వంద రోజులు ఆడిందంటే అదొక అరుదైన రికార్డ్ అనడంలో సందేహం లేదు.
I dare to #Pathaan movie to collection the half amount money of Either #RRR or #KGF2 and also the love and respect #RRR gets from foreigners. And don't flatter yourself so early #Pathanfans wait for 1month's collection. BTW #RRR still running In USA and Japan on it's 10thmonth pic.twitter.com/VxH1akfucU
— Tanmay???????????? (@TanmayK27726998) January 28, 2023