అందితే జుట్టు – అందకపోతే కాళ్ళూ! అన్నట్టుంది యవ్వారం.
ఆమధ్య రాజు గారి జుట్టు గురించి, అదే విగ్గు గురించి చర్చలు చేసి చేసీ బాగా పాపులర్ చేసారు..
నా బొచ్చు పీకలేరు అని ఆయన చేసిన చాలెంజ్ యాక్సెప్ట్ చేసినట్టున్నారు.
డిల్లీ నుంచి వచ్చినాయన్ను పట్టుకుని కాళ్ళ జోలికెళ్ళారు.
చిటికిన వేలు చిట్లినందుకే చుక్కలు చూసారు.
కాలి వేలు ఫ్రాక్చర్ తోపాటు ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న రఘురామకృష్ణరాజు – ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లడంకన్నా ఆస్పత్రిలో ఉండటమే మంచిదని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.
బయటకొచ్చాక ఇంకెట్టుంటదో సినిమా.
మొన్నా మధ్య మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు”లో ఇంటర్వెల్ సీన్ గుర్తొస్తోంది.
కమాన్ ఫోక్స్
చిన్న బ్రేక్
బొమ్మ దద్దిరిల్లిపోద్ది….