ఇదేదో పౌరాణిక సినిమాలో భక్తుణ్ణి కొడితే దేవుడికి వాతలు పడ్డ వ్యవహారం కాదు. అక్షరాలా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్తెక్షంగా YSR కాంగ్రెస్ కి RRR కి మధ్య జరుగుతున్న ప్రహసనం.
ఢిల్లీ కోట నుంచి RRR బర్త్డే కోసం బయటకు రాగానే తమ స్వంత సైన్యంతో పట్టేసుకుని, సంబరపడి పోయి, తమ కచ్చనంతా చూపించడానికి పోలీసులతో కొట్టించి మురిసిపోయిన మురిపెం మూణ్ణిమిషాలైనా నిలవలేదు పాపం. అబ్బే మేం కొట్టలేదు.. ఆయనకేదో స్కిన్ రాష్ అని హాండ్స్ వాష్ చేసుకుందామనుకుంటే… ఆ పప్పులేమీ ఉడకలేదు.. కోర్టుల్లో. ఆళ్ళకు అనుకూలంగా ఉండే ఆస్పత్రుల్లో, అడిగింది రాసిచ్చే డాక్టర్లతో మేనేజ్ చేసేద్దామనుకుంటే.. ఆర్మీ హాస్పిటల్ కి తరలించి గట్టి ఝలక్ ఇచ్చింది కోర్టు. ముఖ్యమంత్రికి కూడా దొరకని అమిత్ షా అపాయింట్మెంట్ రాజు గారి ఫామిలీకి ఆయింట్మెంట్ రాసుకున్నంత ఈజీగా దొరికింది. స్పీకరు, హోం మినిస్టరు, క్షత్రియ సంఘాలు, నియోజక వర్గం ప్రజలు, రాష్ట్రం రాష్ట్రం..చూస్తోంది.. ఈ ‘జగన్నాటకం’.
ఆ మధ్య నిమ్మగడ్డ నుంచి ఈరోజు RRR దాకా కోర్టు మెట్లెక్కి కేసు గెలిచిన సందర్భం ఒక్కటన్నా లేదు ఇప్పుడున్న ప్రభుత్వానికి. ఎప్పుడెళ్ళినా మొట్టికాయలే. ఐనా, కేసులు, సూట్ కేసులు, కోర్టులు, కోవర్టులు, జెయిళ్ళు, బెయిళ్ళు, కొత్త ఎమన్నా?
చెప్పుకోడానికెన్నో ఘంతలున్నాయి కదా.. గొడ్డలి తో నరికితే గుండెపోటు వస్తుంది, తేనెతుట్టె కదిలిస్తే రధం కాలిపోతుంది, పిచ్చోడి చేతికి రాయిస్తే ఆలయంలో విగ్రహాలు పగలుతాయి, అట్టాగే రాజు గారి కాలిమీద కొడితే – స్కిన్ ఇంఫెక్షన్ వస్తుంది.. అనుకున్నారు.. కానీ అక్కడ కొడితే ఇక్కడ వాచింది..
వాతలక్కడ – వాపులు ఇక్కడ..
దెబ్బలక్కడ – బొబ్బలిక్కడ…
కేసులక్కడ – కేకలిక్కడ…
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది పాత సామెత.
రాజు పై దెబ్బ పడితే మొదలైతది గొడవ అన్నది రేపటి సమ్మెట(దెబ్బ).
చూస్తూనే ఉండండి…. “దెబ్బ”కు ఠా.. దొంగల ముఠా..