పని ఒత్తిళ్లు తట్టుకోలేక.. పైనున్న బాస్ మాటలు పడలేక సూసైడ్ చేసుకున్న ఉద్యోగుల గురించి మనకు తెలిసింది. దేశంలో ఏటా ఆత్మహత్యలు పెరుగుతున్న రంగాలు కూడా ఉన్నాయి. పోలీసులు, ఐటీ రంగాల్లో ఆత్మహత్యలు ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారాయి. పని ఒత్తిడి, పై అధికారుల వేధింపుల కారణంగా ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే.. చిత్రంగా ఇప్పుడు.. ఒక రోబో కూడా వర్క్ ప్రజర్ కారణంగా సూసైడ్ చేసుకున్న ఘటన ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది.
ఎక్కడ జరిగింది?
టెక్నాలజీకి కేరాఫ్ అయిన.. దక్షిణ కొరియాలోని కొన్ని సంస్థలు ఇప్పటికే రోబో ఎంప్లాయిమెంట్ కల్పిస్తు న్నాయి. క్లిష్టమైన పనులకు రోబోలను నియమించుకుంటున్నారు. ఇలా.. గూమి సిటీ కౌన్సిల్లో `సైబార్గ్` అనే రోబోను అడ్మినిస్ట్రేషన్ విభాగంగా నియమించుకున్నారు. రెండేళ్లుగా.. ఈ రోబో సేవలు అందిస్తోంది. నిత్యం ఒత్తిడితో ఉండే ఈ పనిని సైబార్గ్కు అప్పగించారు. ఇటీవల వరకు బాగానే పనిచేసిన సైబార్గ్.. జూన్ 24న ఏడు అడుగుల అంతస్థు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఇదేమీ జోక్ కాదు. నిజమేనని గూమి సిటీ కౌన్సిల్ ప్రకటించింది. పక్కా ఆధారాలతో ఈ ప్రకటన చేసింది. ఆత్మహత్య చేసుకునే ముందు.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించినట్టు కూడా.. కౌన్సిల్ వెల్లడించింది. సీసీ టీవీ ఆధారాలు.. వర్క్ ఫోర్స్ వంటివాటిని సమీక్షించడంతోపాటు.. ముక్కలు చెక్కలైన రోబో శరీరభాగాలను కూడా.. ల్యాబుల్లో పరీక్షించిన తర్వాత.. ఇది పక్కా ఆత్మహత్యేనని నిర్ధారించినట్టు గూమి సిటీ తెలిపింది. వర్క్ కారణంగా రోబో డిప్రెషన్లోకి వెళ్లినట్టు తెలిపింది.
పది మంది చేసే పనిని..
సైబార్గ్ రోబో పది మంది చేసే పనిని చేస్తోందని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఆరు వరకు నిర్విరామంగా చేయడంతోపాటు.. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చాలా ముందుందని తెలిపారు.