ఈ శుక్రవారం థియేటర్స్ లో నాలుగు చిత్రాలు సందడి చేయబోతున్నాయి. అందులో రెండు డబ్బింగ్ సినిమాలు కాగా.. రెండు మన తెలుగు సినిమాలు. లాంగ్ వీకెండ్ కావడంతో మైత్రి వారి `రాబిన్ హుడ్`, సితార వారి `మ్యాడ్ స్క్వేర్` చిత్రాలు పోటీ పడుతున్నాయి. వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ మిడ్ బడ్జెట్ మూవీ. అలాగే నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ 2 చిన్న బడ్జెట్ చిత్రం. అయినప్పటికీ రెండు సినిమాలకు ఎక్స్ లెంట్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
నితిన్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది రాబిన్ హుడ్. ఏపీ మరియు తెలంగాణలో ఈ చిత్రానికి రూ.23 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరగగా.. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో రూ. 4.50 కోట్ల బిజినెస్ జరిగింది. రాబిన్ హుడ్ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 27.50 కోట్లు కాగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28.50 కోట్లు.
ఇక సూపర్ హిట్ మూవీ `మ్యాడ్`కు సీక్వెల్ గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్ విషయానికి వస్తే.. ఈ చిత్రం రిమార్కబుల్ బిజినెస్ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 15.50 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగగా.. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 3.5 కోట్ల వరకు బిజినెస్ ను దక్కించుకుంది. మ్యాడ్ స్క్వేర్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 21 కోట్లు కాగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్ల రేంజ్ లో ఉంది. ఏమాత్రం టాక్ డీసెంట్ గా ఉన్నా లాంగ్ వీకెండ్ లో రెండు చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.