వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా ఓ గుడిలో తన చీప్ బిహేవియర్ ను బయటపెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యలు రోజాకు కొత్తేమి కాదు. ఏపీలో గత జగన్ హయాంలో నోటి దురుసు మరియు వివాదాస్పద వైఖరితో ప్రతినిత్యం వార్తల్లో నిలిచారు. రోజా తీరుతో సహనాన్ని కోల్పోయిన ప్రజలు ఓటు అనే ఆయుధంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో ఆమెను చిత్తుచిత్తుగా ఓడించారు.
అయితే ఓడిపోయిన కూడా రోజా తీరు మాత్రం మారలేదు. సోమవారం తమిళనాడులోని తిరెచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి రోజా కుటుంబం వెళ్లింది. ఆలయంలో జరిగిన వరుణాభిషేకంలో భర్త సెల్వమణితో కలిసి రోజా పాల్గొంది. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి బయటకు వస్తుండగా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు కొందరు భక్తులు ఆసక్తి చూపించారు.
భక్తుల్ని నవ్వుతూ పలకరించిన రోజా.. వారితో క్లోజ్ గా నిలబడి సెల్ఫీలకు ఫోజులిచ్చారు. అయితే అంతలోనే ఆలయ ప్రాంగణంలో పని చేసే పారిశుద్ధ్య మహిళా కార్మికులు రోజు రోజాతో ఫోటో దిగేందుకు దగ్గరకు రాబోయారు. అది గమనించిన రోజా దూరంగా నిలబడాలంటూ వారికి సైగలు చేశారు. దాంతో సదరు మహిళా పారిశుద్ధ్య కార్మికులు దూరంగా ఉండే ఫోటో తీసుకున్నారు. ఇందంతా వీడియోలో రికార్డు చేసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టాడు.
ఇక అంతే నెటిజన్లు రోజాను ఓ ఆట ఆడుకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికులు మనుషులు కాదా.. వారంటే అంత చిన్న చూపా అంటూ రోజా తీరుపై మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా రోజుకు బుద్ధి రాలేదంటూ విమర్శకులు కురిపిస్తున్నారు. పారిశుధ్య కార్మికులపై వివక్ష చూపిస్తూ, అసహ్యంగా హావభావాలు పెట్టి వారిని అవమానించిన రోజాపై తమిళ మీడియా సైతం దుమ్మెత్తిపోస్తోంది.
పారిశుధ్య కార్మికులపై వివక్ష చూపిస్తూ, అసహ్యంగా హావభావాలు పెట్టి వారిని అవమానించిన వైసీపీ నేత రోజా రెడ్డి. దుమ్మెత్తి పోస్తున్న తమిళ మీడియా. pic.twitter.com/3LmvNlOvT9
— Telugu Desam Party (@JaiTDP) July 16, 2024