వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లి.. ఓపీలు రాయించుకుని.. డాక్టర్ అప్పాయింట్మెంట్ కోసం వెయిట్ చేయడం.. గంటల తరబడి సమయాన్ని వృథా చేసుకోవడం.. నేడు కామన్ అయిపోయింది. ఏ చిన్న సమస్య వచ్చి ఏ ఆసుపత్రికి వెళ్లినా.. గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే.. ఇలాంటి వెయింటింగులకు, ఆస్పత్రులకు వెళ్లి సుదీర్ఘ నిరీక్షణలు చేయడం వంటివాటికి చెక్ పెడుతూ.. ఇంటివద్దకే వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది `రైట్ కేర్` సంస్థ. ‘హెల్త్ కేర్ @హోమ్’ నినాదంతో ప్రారంభమైన ‘రైట్ కేర్’ రోగులకు అన్ని విధాలా నాణ్యమైన సేవలు అందించేందుకు నడుంబిగించింది. ‘విశాఖపట్నం’ వంటి అభివృద్ధి చెందుతున్న మహానగరంలో ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేయాలనే సదుద్దేశంతో ‘రైట్ కేర్ ‘తన సేవలను ప్రారంభించింది. సమగ్ర వైద్య సేవలతో పాటు నర్సింగ్ కు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కరోనా సమయంలో సేవలు చేరువ..
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎక్కడికి వెళ్లాలన్నా.. ఎవరితో మాట్లాడాలన్నా.. బిక్కు బిక్కు మనే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా జనసమ్మర్థం ఎక్కువగా ఉండే.. ఆసుపత్రులకు వెళ్లాలంటే.. ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడ ఎలా వైరస్ మనకు సోకుతుందోననే బెంగ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇలాంటి సమయంలో అత్యంత కీలకమైన వైద్య సేవలను ఇంటి ముంగిటకే తీసుకువచ్చింది `రైట్ కేర్`. ఈ సంస్థ ఆధ్వర్యంలో సాధారణ వైద్యంతోపాటు, ఫిజియోథెరపీ వైద్య సేవలు కూడా రోగులకు ఇంట్లోనే అందించనున్నారు. అదేసమయంలో వీడియో/ ఫోన్ కన్సల్టెన్సీ(టెలీ మెడిసిన్) ద్వారా కూడా సేవలు అందుబాటులోకి తెచ్చారు. షుగర్ సహా ఏ వ్యాధికైనా సాపింళ్ల సేకరణ, ల్యాబ్ పరీక్షలను కూడా చేరువ చేశారు.సీనియర్ సిటిజన్లకు మరిన్ని సేవలు..
సీనియర్ సిటిజన్లను దృష్టిలో పెట్టుకుని గుండె సంబంధిత వైద్య సేవలు, కేన్సర్, పార్కిన్సన్, అల్జీమర్స్, షుగర్, మానసిక సమస్యలకు కూడా ఇంటి పట్టునే వైద్యం అందించనున్నారు. ‘రైట్ కేర్’ కు చెందిన ఫిజియోథెరపిస్టులు.. ప్రధానంగా నొప్పి నివారణ, సహాయం తదితర అనేక సేవలను అందుబాటులోకి తెచ్చారు. దీర్ఘవ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఇంటి వద్దే సేవలు అందించేందుకు ‘రైట్ కేర్’ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. చికిత్సలు/గాయాలతో బాధపడే వారికి కూడా ఇంటి వద్దే సేవలు అందించనుంది. వైద్య రంగానికే అంకితమైన సిబ్బందితో సేవలు అందించేందుకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు, వైద్యుల కన్సల్టేషన్స్, వ్యాధి నిర్ధారణ సేవలు, నర్సింగ్, ఫిజియోథెరపీ, డైట్ ప్లానింగ్ ఇలా అనేక రూపాల్లో వైద్య సేవలను ఇంటికే చేరువ చేస్తోంది రైట్ కేర్.ఆత్మీయ సేవలు అందుబాటులో..
రైట్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది పేషంట్ల ఇంటి వద్దకే వచ్చి ఆత్మీయ సేవలు అందించేందుకు నిరంతరం సిద్ధంగా ఉంటారనడం సందేహం లేదు. వ్యాధుల అంచనాలు, చికిత్సా విధానాలు, పరిస్థితులకు సంబంధించి ముందుగానే ఎంత ఖర్చవుతుందో రోగులకు వివరించనున్నారు. ప్రతి ఒక్క సిబ్బంది ఎంతో నైపుణ్యంతో సేవలు అందించనున్నారు. వైద్య సేవలు అవసరమైన ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా వయో వృద్ధులకు ఇంటి వద్దే సేవలు అందించేందుకు మేం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాం. `రైట్ కేర్` ఇంటి వద్దే వైద్యాన్ని అందించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. అంకిత భావంతో కూడిన సేవలు అందించేందుకు మా సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉన్నారు- అని ‘రైట్ కేర్ ‘సీఈవో/వ్యవస్థాపకులు మోహిత్ వివరించారు.త్వరలోనే మొబైల్ యాప్..
రైట్ కేర్ మొబైల్ యాప్‌ను కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నారు. యాప్ అందుబాటులోకి వస్తే.. మరింతగా సేవలు విస్తరించేందుకు అవకాశం ఉంటుందని ‘రైట్ కేర్’ సీఈవో/వ్యవస్థాపకులు మోహిత్ అభిప్రాయపడ్డారు.‘రైట్ కేర్’.. గురించి..
‘రైట్ కేర్- హెల్త్ కేర్ @హోమ్’ అనే సంస్థ అమెరికాలోని ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సంస్థ. ప్రధానంగా నాణ్యమైన వైద్య సేవలను ఇంటి వద్దకు చేరేవేసే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అనేక నెలలపాటు ఈ సంస్థకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకుని.. విశాఖలోని నిపుణులైన వైద్యులు, ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకుని ఈ సేవలను ప్రారంభించారు. ప్రస్తుతం ‘రైట్ కేర్ ‘సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.ప్రత్యేకత ఇదే..
కరోనా వచ్చిన తర్వాత అనేక మంది ఇంటి వద్దే వైద్య సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ‘రైట్ కేర్’కు ఇతర సంస్థలకు తేడా ఏంటనే ప్రశ్న వస్తుంది. అదేసమయంలో ‘రైట్ కేర్’ ప్రత్యేకత ఏంటనేది కూడా ఆసక్తి ఉంటుంది. దీనిని మోహిత్ ఇలా వివరించారు. ‘రైట్ కేర్ ‘సంస్థలో నిపుణులైన వైద్యులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారు.రోగుల ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకుని చార్జ్ చేస్తాం. నాణ్యమైన సేవలను అందించడంతోపాటు అంకిత భావంతో వైద్యులు రోగులకు మానసిక ధైర్యాన్ని కూడా నూరిపోస్తారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలకు ‘రైట్ కేర్’ ప్రాధాన్యం ఇస్తుంది అని పేర్కొన్నారు.మరిన్ని వివరాలకు www.ritecare.in. వెబ్‌సైట్‌తోపాటు.. email [email protected] లను సంపద్రదించవచ్చు. అదేవిధంగా +91 9115 789 789 నెంబరులో నేరుగా మాట్లాడి ‘రైట్ కేర్’ సేవలను పొందవచ్చని సీఈవో/ ‘రైట్ కేర్ ‘వ్యవస్థాపకులు మోహిత్ వివరించారు.