వాలంటీర్లను ఉద్దేశిస్తూ నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.. ఆర్జీవీ స్పందించా రు. ప్రజల కోసం పనిచేసే వాలంటీర్లను పవన్ అమ్మాయిల బ్రోకర్లు అన్నారని, అంత నీచంగా, అసహ్యంగా వర్ణించబడ్డ వాలంటీర్లకు సిగ్గు, శరం, ఆత్మాభిమానం ఉంటే పవన్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించారు.
అధికారంలో ఉన్న వైసీపీని మహిళల ట్రాఫికింగ్ చేస్తోందని ఆరోపించడం పవన్ స్థాయికి తగదని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. పవన్ ఆరోపణలపై కేంద్రం వద్ద ఆధారాలు ఉంటే యాక్షన్ తీసుకోకుండా చెవిలో ఎందుకు చెప్పారు..? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆర్జీవీ హాట్ ట్వీట్ చేశారు.
పవన్ ఏమన్నారంటే..
వారాహి 2.0 యాత్ర ప్రారంభించిన పవన్.. వైసీపీ తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేశా రు. రాష్ట్రంలో 30 వేల మంది మహిళల ఆచూకీ కనిపించడం లేదని.. వీళ్లలో ఒంటరి మహిళలు, వితంతువు లు కూడా ఉన్నారని.. వారందరినీ వలంటీర్లు ట్రాప్ చేశారని.. వైసీపీ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనే ఆర్జీవీ మండిపడ్డారు.