వర్మ ఇగోను జగన్ బాగా దెబ్బతీసినట్టున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే సినిమాను కెలకడం కంటే వర్మను ఎక్కువ కెలికారు. దీంతో వర్మ చిరాకెత్తింది.
వర్మకు చిరాకొస్తే
అనిల్ కుమార్ లా అరవడు
అంబటిలా కరవడు
నానిలా తిట్టడు…
ఎక్కడ అగ్గిపెట్టాలో ఎపుడు అగ్గిపెట్టాలో అక్కడ అపుడు పెడతాడు.
నిన్న ఉద్యోగుల తిరుగుబాటు వర్మకు నచ్చింది. తన ట్వీట్ ద్వారా జాతీయ దృష్టిని దానిపై మరల్చే ప్రయత్నం చేశాడు.
ఏపీ ప్రజలకోసం నా నుంచి ఒక అద్భుతమైన సలహా అంటూ ఒక సింపుల్ పోస్ట్ పెట్టాడు.
‘‘ఒక నిరసనకు నా ఏకైక సలహా ఏమిటంటే, తిరగబడాల్సినపుడు, అరవడాల్సినపుడు పోరాడకుండా మౌనంగా ఉండటం పిరికితనం అవుతుంది!
My single point advise to AP protestors is that Silence becomes cowardice when occasion demands shouting!
— Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2022
విజయవాడలో ప్రజల తిరుగుబాటు వర్మనే కాదు చాలామందిని కదిలించింది.
సినీ రచయిత బీవీ రవి… ఏపీ ప్రభుత్వ అహంకారన్ని కోట్ చేస్తూ చేసిన ఈ ట్వీట్ చూడండి.
అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయo చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది.
— BVS Ravi (@BvsRavi) February 3, 2022